అల వైకుంఠపురములో ..బన్నీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా. అంతేకాదు బన్నీ కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకం, ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే గత సంవత్సరం వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ బన్నీ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తీశాడు. ఈ సినిమా కోసం తనని తాను కొత్తగా మలుచుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్ పాత్రకోసం చాలా కష్ట పడ్డాడు. కానీ సినిమా పరాజయాన్ని మూట గట్టుకుంది. అయితే బన్నీ పర్ఫార్మెన్స్ కి మాత్రం విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా పరాజయం మాత్రం బన్నీ బాగా బాధించింది. ఎన్నో ఆశలు నమ్మకం పెట్టుకొని గొప్ప ఎక్స్‌పరిమెంట్ చేస్తే ఇలా బెడిసి కొట్టిందని చాలా రోజులు బాధపడ్డాడు. అందులో నుంచి కోలుకొని వేరే డైరెక్టర్ తో అనుకొని కూడా మళ్ళీ మాటల మాంత్రీకుడి సినిమా అయితే అన్ని విధాలా సేఫ్ అని ఫైనల్ గా 'అల' కోసం కమిటయ్యాడు. 

 

ఇక ఇంతక ముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి హిట్ అవడంతో ముచ్చటగా మూడోసారి బన్నీ- త్రివిక్రమ్ కాంబో సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక గత మూడు నెలలుగా నువా - నేనా అంటూ బన్నీ, మహేష్ పోటీ పడుతూ ఇక్కడిదాకా వచ్చారు. అయితే ఇప్పటికే మహేష్ సినిమా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బన్నీ అండ్ బన్నీ ఫ్యాన్స్ 'అల' గ్యారెంటీ హిట్ అని నమ్మకంగా ఉన్నారు. కానీ ఆ నమ్మకం కాస్త వమ్ముగా అయిందని బన్నీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 

 

ముందు నుంచి ప్రచారం అయినట్టుగా 'అల' ఆ రెండు సినిమాలకి కాపీ అని కథ లేదని తేల్చేశారు. ఎప్పటిలాగే కొన్ని పంచ్ డైలాగ్స్ కొన్ని ఫన్నీ సీన్స్ తో లక్కొచ్చాడని..ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తమన్ ఎంతో కష్టపడి మంచి మ్యూజిక్ ఇస్తే అది కాస్తా 'నో యూజ్' అన్నట్టుగా అయిపోయిందని అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే బన్నీనే సినిమాకి ఆకర్షణ.. ఆతర్వా తమన్ సంగ్స్ అంటున్నారు. అంతేకాదు ప్రేక్షకులు ఎంతో నమ్మకం పెట్టుకున్న 'అల' అలా..... కొట్టుకుపోయిందని సెటైర్స్ వేస్తున్నారు.  మరి అజ్ఞాతవాసి లాంటి భారీ ఫ్లాప్ తర్వాత కూడా కాపీ అన్న ముద్ర గట్టిగా పడ్డప్పటికి త్రివిక్రం ఎందుకు అదే దారిలో వెళుతున్నారో అర్థం కావడం లేదు. పైగా ప్రేక్షకుల నాడి పట్టుకోవడానికి ఏదైనా మీటర్ ఉంటే బావుండు అంటూ కొత్తగా కామెంట్స్ చేస్తున్నాడు. ఒకవేళ నిజంగా అలా మీటర్ దొరికే ఎవరికి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా తీస్తాడా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: