బన్నీ, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల అరవింద సమేత వంటి ఎమోషనల్, మాస్ మూవీని తీసిన త్రివిక్రమ్, ఈ సినిమాను తప్పకుండా తన ఎంటర్టైన్మెంట్ జానార్ లో తీసి ఉంటారని అందరూ భావించడం జరిగింది. దానికి తోడు ఈ సినిమాలోని సాంగ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పాటు యూట్యూబ్ లో అవి అదిరిపోయే రేంజ్ లో లైక్స్, వ్యూస్ దక్కించుకోవడంతో సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోయాయి. 

 

ఇక ఆ విధంగా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఓవర్ ఆల్ గా మాత్రం కొంత యావరేజ్ టాక్ ని వినపడుతోందని అంటున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా మాత్రం వారు ఊహించిన రేంజ్ లో అయితే లేదట. ఫస్ట్ హాఫ్ ని ఒకింత బాగానే నడిపిన దర్శకుడు త్రివిక్రమ్, మంచి ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ సీన్స్ ని జొప్పించినట్లు చెప్తున్నారు. అలానే ఆకట్టుకునే ఇంటర్వెల్ ఎపిసోడ్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని, ఆ ఎమోషనల్ సీన్ తరువాత ఆడియన్స్ కి సినిమా సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు. ఇకపోతే ఒకింత మెల్లగా ప్రారంభం అయిన సెకండ్ హాఫ్, అక్కడక్కడా కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే పంచ్ డైలాగ్స్ తో ముందుకు సాగుతుందట. ఇక అదే సమయంలో వచ్చే సాంగ్స్ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయని అంటున్నారు. 

 

ఇక విజువల్ పరంగా మంచి ట్రీట్ ఇచ్చిన ఈ సినిమాకు యాక్షన్ సీన్స్ కూడా మంచి ప్లస్ అయ్యాయని అంటున్నారు. అయితే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఈ సినిమా, త్రివిక్రమ్ గత సినిమాలను గుర్తు చేయడం మాత్రం జరుగుతుందని, అలానే సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే బోరింగ్ సీన్స్  అయితే కొంతవరకు ఆడియన్స్ ని విసిగిస్తాయని అంటున్నారు. ఈ విధంగా మొత్తంగా సాగిన ఈ అలవైకుంఠపురములో చూసిన తరువాత కొందరు ప్రేక్షకులు మాత్రం ఇదేమి సినిమారా బాబు అని మాత్రం అనుకుండా ఉండరని సమాచారం. చూద్దాం మరి మున్ముందు ఈ సినిమా విషయంలో ఏమి జరుగుతుందో.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: