స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఇక అల్లు అర్జున్ లాంగ్‌ గ్యాప్ తర్వాత‌ నటించిన ఈ సినిమా కావ‌డంతో ఫ్యాన్స్‌ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ప‌లు చోట్ల బెనిఫిట్ షోల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది.

 

ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. బన్నీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి నిరుద్యోగి జాబ్ కోసం ట్రై చేసి ఓ పెద్ద కంపెనీలో జాయిన్ అవుతాడు. ఓనర్ అయిన పూజ హెగ్డే కి అసిస్టెంట్ ఆత్మాభిమానంకు. మంచి కి చాలా విలువ ఇస్తుంటాడు. ఆస్తులు కంటే విలువైనంది బంధాలు అని భావిస్తుంటాడు. ఇది నచ్చిన పూజ హెగ్డే బన్నీతో లవ్ లో పడుతుంది. సినిమా మొత్తం కూడ చాలా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. ఇక సెకండాప్ లో అసలు బన్నీ ఎవరు అనేది ట్విస్ట్. 

 

 అలాగే సినిమా విజిల్ సిన్స్ విష‌యానికి వ‌స్తే.. త్రివిక్రమ్ మార్క్ క్లాస్ కామెడీ,  మనసుకు హత్తుకునే ఎమోషనల్ సీన్స్,  అల్లు అర్జున్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్, ఎంగేజింగ్ గా సాగే సెకండాఫ్, థమన్ మ్యూజిక్ అండ్ పిఎస్ వినోద్ విజువల్స్, స్టార్ హీరోస్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ లో చేసే ఆఫీస్ సీన్ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ గా నవ్విస్తుంది. మ‌రియు బోరింగ్ మూమెంట్స్‌ విష‌యానికి వ‌స్తే.. స్లో అండ్ ఊహాజనితంగా సాగే కథనం, ఫస్ట్ హాఫ్ స్లోగా సాగడం, కొన్ని సీన్స్ ఆయన గత సినిమాని గుర్తు చేయడం – సినిమా లెంగ్త్ సినిమాలో బోరింగ్ మూమెంట్స్‌ అని చెప్పాలి. ఓవ‌ర్ ఆల్‌గా అలా వైకుంఠపురం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనమెంట్ సినిమా అని చెప్పోచ్చు.

   

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: