తెలుగు అగ్రహీరో  అల్లు అర్జున్, పూజ హెగ్డే హిరో హీరోయి న్లు గా నటిస్తున్నారు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. దాదాపుగా రెండేళ్లు ఖాళీగా ఉన్న ఈ హీరో ఈ సినిమాతో హిట్ కొడతాడు అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.. మొత్తని ఈ సినిమా జనవరి 12న విడుదల అయింది.

 

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. 

 

దర్శకుడు మాటల మాంత్రికుడు అలియాస్ గురూజీ అలియాస్ త్రివిక్రమ్ గారి దగ్గరికి వస్తే.. కథ కోసం ఎంచుకున్న పాయింట్ ని అండర్ కరెంట్ గా చెప్పడానికి ప్రయత్నించాడు, అందుకే చెప్పాలనుకున్న పాయింట్ పర్ఫెక్ట్ గా రీచ్ కాలేదు. కథగా డెవలప్ చేసినప్పుడు కూడా ఆయన పాత చిత్రాలలానే రాసుకున్నారు.కొత్తగా ఈ సినిమాలో ఏది చూపించలేదని అర్థమవుతుంది.. ఈ సినిమాకు మంచి స్పందన ఓ మాదిరిగా ఆకట్టుకుంటుంది..

 

అసలు విషయానికొస్తే..ఈ సినిమాలోని హీరోయిన్ అయినా పూజ హెగ్డే పాత్ర చెప్పుకోదగినది ఏం కాదు. కానీ ఫస్ట్ హాఫ్ లో తన లవ్ ట్రాక్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించి కుర్రకారుకి కావాల్సిన నేత్రానందాన్ని అయితే ఇచ్చింది. ఎక్క‌డా కూడా ఫుల్‌డ్రెస్సులో క‌న‌ప‌డ‌లేదు.. మోకాళ్ల‌కు పైనే స్క‌ర్ట్‌లే వేసింది. కుర్ర‌కారు ఆమె అందాలు బాగా ఎంజాయ్ చేశారులే..కానీ సెకండ్ ఆఫ్ లో ప్రేక్షకులకు కావలసిన స్టప్ లేదని టాక్.. ఓవర్ ఆల్ గా చూసుకుంటే ఈ సినిమా బాగానే రాబడుతోంది అనే వార్తలు వినపుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: