స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

 

అయితే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీత బాణీలను ఎస్. థమన్ సమకూర్చగా, ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఇక త్రివిక్రమ్ తో ఏ ముహూర్తాన జర్నీ మొదలు పెట్టాడో కానీ అక్కడ నుంచి ఓ సరికొత్త థమన్ తనని తాను పరిచయం చేసుకున్నాడు. పాటలు కానీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ కానీ ఒక రేంజ్ లో ఈ చిత్రానికి ఇచ్చాడు. ఇవి ఖచ్చితంగా సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే ఆల్బ‌మ్ హిట్ అవ్వ‌గా ఇప్పుడు మ‌ళ్లీ ఈ సినిమాతో సాంగ్స్‌, ఆర్ ఆర్ సూప‌ర్ హీట్ అయ్యింది.

 

కాగా, జులాయి, స‌న్ ఆఫ్‌ సత్యమూర్తిలతో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌నే ఈ చిత్రం. ఇక ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా రావడం, అది కూడా క్లాస్ గా సాగే హ్యాపీ ఫామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సంక్రాంతికి అందరు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి ఇష్టపడతారు. కథ పరంగా గొప్పగా లేకపోయినా,  త్రివిక్రమ్ కామెడీ, డైలాగ్స్ మరియు ఎమోషన్స్ తో అల్లు అర్జున్ తో మేజిక్ క్రియేట్ చేసేసాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం సంక్రాంతి బ‌రిలో ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఎంత వ‌ర‌కు నెగ్గుకొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: