మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో. యువ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఆయన సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణలు సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బన్నీ తండ్రిగా మురళి శర్మ నటించిన ఈ సినిమాలో టబు ఒక కీలక పాత్రలో నటించింది. 

 

ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలావరకు మంచి ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో సాగుతుందని, అలానే ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి ఎమోషనల్ గా సాగి, సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుందట. అయితే ఒకింత మెల్లగా సాగె సెకండ్ హాఫ్ లో కొన్ని కీలక ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ తో పాటు ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయంటున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్, ఎమోషనల్ గా సాగె క్లైమాక్స్ సీన్స్ సెకండ్ హాఫ్ కి మంచి బలం అని అంటున్నారు. ఇక జులాయి చిత్రం తర్వాత ఈ చిత్రంలో బన్నీ కామికల్ టైమింగ్ ను మనం మరోసారి చూడొచ్చు.అలాగే త్రివిక్రమ్ సినిమా అంటేనే ఫలితంతో సంబంధం లేకుండా డైలాగులు కోసం ప్రతీ ఒక్కరూ అడుగుతారు. అలా ఈ చిత్రంలో త్రివిక్రమ్ పేల్చిన డైలాగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ లోని ఎమోషన్స్ కానీ ఈ చిత్రానికి నిర్మొహమాటంగా పెద్ద ఎస్సెట్ అని చెప్పొచ్చు. 

 

ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌డైలాగులు బాగా పేలాయి. అలానే బన్నీ, పూజ హెగ్డేల పెయిర్ సినిమాలో ఎంతో అందంగా ఉందని, ఇక సాంగ్స్ అయితే విజువల్ గా ఎంతో అందంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని, మంచి ఎమోషనల్ గా సాగె కొన్ని సీన్స్ వారికి బగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. మొత్తంగా త్రివిక్రమ్, బన్నీ ఇద్దరూ కలిసి చేసిన ఈ సినిమా ఆశించినంత గొప్పగా లేనప్పటికి, చాలావరకు అంచనాలు అందుకుంటుందని అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: