సంక్రాంతి వచ్చిందంటే సినిమాల సందడి ఎంతగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్లూ అంతే పండుగ చేసుకుంటారు. ఈ పోటీలో మంచి రేసులో ఉన్న సినిమాలు మహేశ్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల.. వైకుంఠపురంలో. ఈ సినిమాలు ఎంత పోటీ పడుతున్నాయో వీటికి సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్, థమన్ మధ్య అదే పోటీ నెలకొంది. ఈ పోటీలో థమన్ దే పైచేయి సాధించింది అని చెప్పాలి. సినిమాలో చాలా చోట్ల హార్ట్ టచింగ్ గా ఉంది అనే చెప్పాలి. సంక్రాంతి పోరులో థ‌మ‌న్ తాను గెలిచి త‌న టీంను గెలిపించాడు.

 

 

అల.. వైకుంఠపురంలో సినిమాకు సంబంధించి సందడంతా అక్టోబర్ నుంచే ప్రారంభమైపోయింది. సామజవరగమన, రాములో రాములా పాటలు రెండూ ఒకదాని మించి మరొకటి భరీ విజయం సాధించాయి. ప్రేక్షకుల మదిలో బాగా సందడి చేశాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే అంచనాలు పెరిగిపోయాయి. అనుకున్నట్టే సినిమా రిలీజ్ కాగానే ఈ పాటలపై ఫోకస్ ఎక్కువైంది. సినిమా హిట్ టాక్ రావడం,, పాటలకు ధియేటర్లలో విజిల్స్ పడడం కూడా జరిగిపోతోంది. దీంతో ఈ సినిమా హిట్ లో థమన్ ది కీలకపాత్రగా మారిపోయింది.

 

 

కానీ ఈమధ్య దేవీశ్రీ ప్రసాద్ ఎంత వెనుకబడ్డాడో తెలిసిందే. దీంతో సరిలేరు.. కు అంత ఇంపాక్ట్ కలిగించలేక పోయాడు. పాటలు ఏమాత్రం దేవీశ్రీ మార్క్ కు తగ్గట్టు లేవు. దీంతో సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు పాటలు ఈ సినిమాకు మైనస్ గా మారాయని చెప్పాలి. ఈ సినిమాకు ముందు వరకూ దేవీ మ్యూజిక్ పై మహేశ్ నమ్మకుంచాడు కానీ అభిమానులు మాత్రం వద్దనే అన్నారు. చాలెంజ్ యాక్సెప్టడ్ అన్న దేవీ సరిలేరు నీకెవ్వరు సినిమా సంగీతంతో ఆకట్టుకోలేక పోయాడని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: