కొన్ని కాంబినేషన్లు  సెన్సేషన్లు క్రియేట్ చేస్తాయి. వసూళ్ళ వరద సృష్టిస్థాయి అలాంటి బన్నీ, త్రివిక్రమ్ ల కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఈరోజు రిలీజ్ అయిన “అల వైకుంటపురంలో” సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం ఏమిటి..??  వరుసగా మూడో సారి ఈ ఇద్దరు ఎలా హిట్ కొట్టారు...?? ఇంతటి భారీ విజయం ఎలా సాధ్యమయ్యింది అనే వివరాలలోకి వెళ్తే..

 

 

సినిమా అయినా హిట్ అని చెప్పాలంటే ముందు డిసైడ్ చేసేది పాటలే. సినిమాలో సంగీతం బాగుందంటే ఆ సినిమా సగం హిట్ అయినట్టే. పాటలు వినడానికి ఎంత వీనుల విందుగా ఉంటే సినిమా పై హిట్ ప్రభావం అంతగా ఉంటుంది. వినగానే నచ్చిన పాటలని సినిమా తెరపై  చూస్తే అది కూడా హత్తుకునేలా ఉంటే  ఆ కిక్కే వేరు కదా. అల వైకుంటపురం సినిమా భారీ విజయాన్ని సాధించడానికి కారణం సగానికి  సగం తమన్ అందించిన సంగీతమని గుక్క తిప్పుకోకుండా చెప్పచ్చు..

 

ముఖ్యంగా ఈ సినిమాలో శిద్ది శ్రీరామ్ పాడిన సామజ వరగమన పాట ఎంతటి పాపులారిటీ తీసుకువచ్చిందనే విషయం  ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఆ పాటకి భిన్నంగా తెలంగాణా యాసలో సాగిన రాములో రాముల పాట కూడా సినిమాకి పెద్ద అసెట్ అయ్యింది. ఇక బుట్ట బొమ్మ ప్రేక్షకులని బుట్టలోనే వేసేసింది. ఇదిలాఉంటే ఈ సినిమాలో పాటలని మేకింగ్ వీడియోస్ గా ప్రజెంట్ చేసిన తీరు ప్రతీ ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో పనిచేసిన టెక్నికల్ టీమ్ మొదలు సింగర్స్, నటులను  మేకింగ్ లో చూపిస్తూ సినిమాపై క్రేజ్ ని పెంచేశారు. అంతేకాదు బన్నీ ఫ్యామిలీని కూడా ఈ మేకింగ్ వీడియోలో చూపించింది చిత్ర యూనిట్. ఇక మాటల మాంత్రికుడి మాయాజాలం, బన్నీ స్టైల్ , తనదైన నటన ఈ సినిమాకి పెద్ద అసెట్ అయ్యాయి.

 

 

హీరోయిజం కంటే కూడా కధకే ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడంతో ఈ సినిమా ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇక బన్నీ కొత్త గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతో శ్రద్ద వహించాడు. ఫోటోగ్రఫి చంపేసింది. ఇక ప్రఖ్యాత నటులు టబు, తమిళ నటులు, ఇలా ఎంతో మంది ఈ సినిమాకోసం పెట్టిన ఎఫర్ట్ తెరమీద స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. ఓ మంచి సినిమాకి ఉండవలసిన లక్షణాలు అన్నీ గంపగుత్తంగా ఉంటే సినిమా హిట్ కాకుండా ఉంటుందా చెప్పండి...  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: