అనీల్ రావిపూడి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే రాజమౌళి, కొరటాల శివ ల వంటి టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ముందుగా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రాం హీరోగా పటాస్ సినిమాని తెరకెక్కించి మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో అందరి దృష్ఠిని ఆకర్షించాడు. ఇక పటాస్ తో కళ్యాణ్ రాం కి కూడా ఈ సినిమా మంచి హిట్ సినిమా తన కెరీర్ లో నిలిచిపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగా కాంపౌండ్ నుండి వచ్చిన సాయి ధరం తేజ్-రాశీ ఖన్నా హీరో హీరోయిన్స్ గా సుప్రీమ్ సినిమాని తెరకెక్కించి మరోసారి హిట్ కొట్టాడు. దాంతో ఇండస్ట్రీ దృష్ఠి ఒక్కసారిగా అనీల్ రావిపూడి మీద పడింది. హీరోలందరు అనిల్ తో సినిమా చేయడానికి కథ సిద్దం చేసుకోమని చెప్పడం, అలాగే  బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కడంతో నిర్మాతలు అనిల్ ని అడ్వాన్సులిచ్చి లాక్ చేసుకున్నారు. ఆ లిస్ట్ లోనే ముందు దిల్ రాజు అనిల్ ని మహేష్ సినిమాకోసం లాక్ చేసుకున్నాడు.

 

ఇక దీనికి ముందు మాస్ మహా రాజా ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. దాంతో అనిల్ చెప్పిన కథ నచ్చి వెంటనే ఒకే చేశాడు. ఆ సినిమా రవితేజకి మంచి సక్సస్ ని ఇచ్చింది. ఒకరకంగా రవితేజకి కం బ్యాక్ మూవీ అని చెపాలి. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్.. ఇలా వరుసగా మూడు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. దాంతో మల్టీస్టారర్ కి ప్లాన్ చేసి అనుకున్నట్టుగానే రెడీ అయ్యాడు. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఒక యంగ్ హీరోలతో సినిమాని తెరకెక్కించాలని అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఎఫ్ 2 కి విక్టరీ వెంకటేష్-మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లను సెలెక్ట్ చేసుకొని మైండ్ బ్లోయింగ్ హిట్ ని కొట్టాడు. అంతేకాదు ఏకంగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా సక్సస్ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు అనీల్ కి గోల్డెన్ ఛాన్స్ ని ఇచ్చాడు. 

 

ఆ ఛాన్స్ ని అనీల్ మిస్ చేసుకోవద్దని అనుకున్నాడు. అందుకే ఆర్మీ బ్యాగ్డ్రాప్ లో కథ అని చెప్పాడట. దాంతో ఈ లైన్ మహేష్ కి ఇంట్రస్టింగ్ అనిపించడంతో కంప్లీట్ గా స్క్రిప్ట్ రెడీ చేయమనడంతో ఆగ మేఘాల మీద రావిపూడి తన అసోసియోట్స్ తో సరిలేరు కథని సిద్దం చేసి మహేష్ కి నెరేట్ చేశాడు. చెప్పినప్పుడు చాలా బావుందనిపించిన సరిలేరు కథ స్క్రీన్ మీద చూసుంటే మాత్రం సరిలేరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ముఖ్యంగా మహేష్ ఇలా ఉందేంటి నేను విన్నది ఈ కథేనా అనే సందేహం కలిగిందట. అంతేకాదు అసలు నువ్వు చెప్పిందేంటి తీసిందేంటి ..జనాలు సినిమా చూసి ఏమనుకుంటున్నారో తెలుసా అంటూ అనిల్ తో కాస్త సీరియస్ గా అన్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో వాస్తవమెంతుందో తెలీదు గాని సరిలేరు మాత్రం రిజల్ట్ బాగా తేడా కొట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: