విక్టరీ వెంకటేశ్ ,యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్  మల్టీ స్టారర్ మూవీ వెంకి మామ.  మంచి అంచనాల మధ్య  గత ఏడాది డిసెంబర్ 13న  విడుదలైన  ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను రాబట్టుకున్నా  టాక్  బాగుండడంతో  ప్రపంచ వ్యాప్తంగా 40కోట్ల షేర్ ను రాబట్టి  సూపర్ హిట్ అనిపించుకుంది.  అయితే ఈ చిత్రం  విడుదలైన  నెల రోజులకే అమెజాన్ ప్రైమ్ లోకి  వచ్చింది. 
 
నిజానికి ఒప్పదం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారం లో వెంకి మామ ను విడుదలచేయాల్సి ఉండగా  సంక్రాంతి  హడావిడి లో సైలెంట్  గా నిన్న నే  ప్రైమ్ , డిజిటల్ లోకి రిలీజ్ చేసింది.  బాబీ డైరెక్షన్ లో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కిన  ఈ చిత్రంలో  వెంకీ సరసన  హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ నటించగా   నాగ చైతన్య కు  జోడిగా  రాశీ ఖన్నానటించింది.  
 
ఇక ఈ చిత్రం తో  వెంకీ , చైతన్య  గత ఏడాది  బ్యాక్ టు బ్యాక్  హిట్లు  కొట్టారు. అందులో భాగంగా  పోయిన సంక్రాంతికి  వెంకీ ,ఎఫ్ 2 తో  ప్రేక్షకులముందుకు  రాగ  ఆ చిత్రం ఆయన  కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి   బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమా  గా  నిలువగా  సమ్మర్ లో మజిలీ తో వచ్చి  సూపర్ హిట్ కొట్టాడు  నాగ చైతన్య.  ఇక ప్రస్తుతం  చైతన్య , శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో  తన  19వ చిత్రంలో నటిస్తుండగా  వెంకీ, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో అసురన్ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం యొక్క షూటింగ్  అనంతపురంలో  ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: