సంక్రాంతి పండుగను పురస్కరించుకు విడుదలైన సినిమాలు అప్పుడే ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి . సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా  సంక్రాంతి  సందడిలో భాగంగా తొలుత ప్రేక్షకుల ముందుకు రాగా , ప్రిన్స్ మహేష్ బాబు , స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ లు నటించిన సరిలేరు నీకెవ్వరు ...  అల వైకుంఠపురం చిత్రాలు ఒకటి వెంట ఒకటి ప్రేక్షకులను పలకరించాయి . ప్రస్తుతం ఈ మూడు చిత్రాలను పైరసీరాయుళ్లు ఆన్ లైన్ లో ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించారు .

 

 పైరసీ ని ఎంకరేజ్ చేయవద్దని సినీ హీరోలు , దర్శక, నిర్మాతలు ఎంతగా వేడుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇదేమి పట్టించుకోవడం లేదు . సినిమా విడుదలైన 24 గంటల వ్యవధిలోనే పైరసీ చేసి ఆన్ లైన్ లో వివిధ వెబ్ సైట్లలో పెట్టేస్తున్నారు . కోట్లు కుమ్మరించిన చిత్రం పైరసీ అయిన విషయం తెలియగానే దర్శక , నిర్మాతలకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది . సైబర్ చట్టాలను సమర్ధవంతంగా వినియోగించుకుని నేరగాళ్లపై ఏమైనా చర్యలు తీసుకుందామని భావించిన సినీ పరిశ్రమ  వారిని ఏమి చేయలేక చేష్టలుడిగి చూస్తోంది . దానికి కారణం లేకపోలేదు . సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ  ఈ నెట్ వర్క్ అంత నడిపిస్తున్నట్లు తెలియడం తో, వారిపై చర్యలు అంత ఆషామాషీ కాదని తెలుసుకుని  తమ ఖర్మ ఇంతేనని సరిపెట్టుకుంటున్నారు .

 

చిత్రం విడుదలైన 24 గంటల వ్యవధిలోనే పైరసీ చేస్తూ తమ శ్రమను దోచుకుంటున్న వారిపట్ల పోలీసులు సైబర్ చట్టాలను వినియోగించుకుని కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు . తమ సినిమా పరిశ్రమ పెద్దలు ఈ విషయం లో జోక్యం చేసుకుని , పైరసీని అరికట్టాలని లేకపోతే సినీపరిశ్రమ మనుగడే ప్రమాదం లో పడే అవకాశాలు లేకపోలేదని పలువురు హెచ్చరిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: