సంక్రాంతి అంటే ప్రజల పండగనే కాదు. సినిమాల పండగ కూడా. ఎందుకంటే సంక్రాంతి కానుకగా ప్రత్యేకంగా సినిమాలను రిలీజ్ చేయాలని పోటిపడటం ఇందుకు నిదర్శనం. ఇకపోతే ఈసారి బరిలో నాలుగు సినిమాలు నిలవగా, మూడు చిత్రాల రిజల్ట్ ఇప్పటికే వచ్చేసింది.. ఇక నాలుగొవ చిత్రం. రేపు అనగా జనవరి 15 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పేరు 'ఎంత మంచివాడవురా'.. పెద్ద సినిమాలకు పోటిగా ఈ చిత్రం నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు..

 

 

ఇకపోతే శతమానం భవతి అంటూ గత సంవత్సరం కూడా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టిన దర్శకుడు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, మెహ్రీన్ కథానాయకగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్స్ కి మంచి టాక్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రం ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది.  ముందుగా ఈ సినిమాకి 'ఆల్ ఈజ్ వెల్' అనే టైటిల్ ను అనుకున్నారట. కానీ ఈ కథకి తెలుగుదనంతో కూడుకున్న టైటిల్ అయితే బాగుంటదని అనుకోవడంతో దాన్ని ఎంత మంచివాడవురా' టైటిల్ ను సెట్ చేశారట.

 

 

ఇక ఈ టైటిల్‌ను  'నమ్మిన బంటు' సినిమా పాట నుండి తీసుకున్నారని తెలిసింది.. ఇక టైటిల్‌ జస్టిఫికేషన్‌ విషయానికి వస్తే హీరో తన చుట్టూ జరిగే పరిస్థితులను చెడుగా తీసుకోడు. ఇక జీవితంలో ఇతరులకు ఇవ్వడం అనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించాడట దర్శకుడు.

 

 

సినిమా లో కళ్యాణ్ రామ్ తో పాటు టి.ఎన్.ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్ తదితరులు నటిస్తుండగా, శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా కలిసి సంయుక్తంగా నిర్మించగా.. గోపీ సుందర్ సంగీతం అందించాడు. శతమానం భవతి లాంటి ఫ్యామిలీ సినిమా తీసి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సతీశ్ వేగేశ్న, ఈ చిత్రంతో మరో అవార్డు అందుకుంటాడో లేదో చూడాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: