త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రతి ఒక్కరు సినిమా ఇండస్ట్రీలో గురూజీ అని పిలుస్తుంటారు.  దానికి చాలా కారణాలు ఉన్నాయి.  అయన సెట్స్ లో ఉండగా కెప్టెన్.. సినిమా తరువాత మాములు వ్యక్తి.  కానీ, సినిమా బయటకూడా ఆయన్ను గురూజీ అనే పిలుస్తుంటారు.  ముఖ్యంగా మెగా కుటుంబంతో ఆయనకు చాలా పెద్ద అనుబంధం ఉన్నది.  పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు చేశారు.  ఇప్పుడు బన్నీతో మూడు పూర్తి చేశారు.  మెగాస్టార్ తో ఓ సినిమా చేయబోతున్నారు.  


అంటే మెగా ఫ్యామిలీతోనే ఆయనకు ఎక్కువ సినిమాలు చేశారు.  ఇకపై కూడా ఆ ఫ్యామిలీతోనే ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం ఉన్నది.  బన్నీతో తీసిన అల వైకుంఠపురంలో సినిమా మంచి వసూళ్లు సాధిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నది.  సినిమాకు హిట్ టాక్ రావడంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  అయితే, ఈ సినిమా గురించి త్రివిక్రమ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.  అవికూడా ఇందులో దాచిపెట్టిన విషయాలు.  


త్రివిక్రమ్ రెండు విషయాలను బయటపెట్టకుండా దాచిపెట్టారు.  ఒకటి బన్నీ నటన గురించి కాగా, మరొకటి సాంగ్ గురించి.  బన్నీ మంచి డ్యాన్సర్ అనే విషయం అందరికి తెలుసు.  అప్పుడప్పుడు అతనిలో మంచి నటుడు కూడా కనిపిస్తాడు.  కానీ, ఆ నటుడు అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాడు.  ఆ నటుడిని సినిమా మొత్తం చూపిస్తే ఎలా ఉంటుంది అనే భావనతో బన్నీని ప్రతి సీన్స్ లో అవుట్ అండ్ అవుట్ నటన రాబట్టే విధంగా ప్లాన్ చేసినట్టుగా త్రివిక్రమ్ చెప్పారు.  


ఇక రెండో విషయం ఏమిటంటే, ఇందులోని సాంగ్ గురించి.  ఇందులో సిత్తరాల అనే సాంగ్.  ఈ సాంగ్ షూటింగ్ చేయాలి అనుకున్న ముందురోజు రాత్రి త్రివిక్రమ్ యూనిట్ వద్దకు వచ్చింది.  ఈ సాంగ్ శ్రీకాకుళం యాసలో ఉంటుంది.  థమన్ అరగంటలో సాంగ్ ను ట్యూన్ చేశారు.  ఈ సాంగ్ చాలా బాగా ఉంటుందని, ఈ సాంగ్ ను శ్రీకాకుళం వాళ్లకు అంకితం ఇస్తున్నట్టు త్రివిక్రమ్ పేర్కొన్నారు.  నిర్మాతలు రూపాయి అడిగితె రూ. 1.50 ఇచ్చారని అన్నారు. ఇక పూజాను తీసుకోవడానికి ఆమె డెడికేషన్ కారణం అని చెప్పాడు త్రివిక్రమ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: