కొరటాల శివ... ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా జనతా గ్యారేజ్.  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు.  ప్రకృతి మనల్ని ప్రేమిస్తే, అదే మిమ్మల్ని రక్షిస్తుంది.  కానీ, ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని పక్కన పెట్టి, దాని వినాశనం కోరుకుంటున్నారు.  ప్రకృతి మనిషిపై పగపడితే ఎలా ఉంటుందో తెలుసా... మనిషి మరో మనిషిపై యుద్ధం చేయాలి అనుకుంటాడు.  అదే ప్రకృతి మనిషిపై యుద్ధం చేస్తే... అది ప్రళయం కంటే భీకరంగా ఉంటుంది.  మనిషి ఆనవాళ్లు కూడా దొరక్కుండా చేస్తుంది.

 
దీనిని ఆధారంగా చేసుకొని ఎన్టీఆర్ తో కొరటాల శివ జనతా గ్యారేజ్ చేశారు.  ఇందులో ఎన్టీఆర్ చెప్పే డైలాగులు సూపర్ గా ఉంటాయి.  ఎన్టీఆర్ నటనకు మరో కోణం ఈ సినిమా.  ఇందులో మెకానిక్ సత్యంగా మోహన్ లాల్ నటించారు.  ఈ సినిమాలో అయన పాత్ర కూడా చాలా డిఫెరెంట్ గా ఉంటుంది.  ఆ పాత్రకు ఒక డిక్షన్ ఉంటుంది.  సైలెంట్ గా ఉంటూనే వైలెన్స్ సృష్టిస్తుంటారు.  ఇలాంటి పాత్రలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు.  


మొదట ఈ సినిమాలో ఆ పాత్ర కోసం బాలయ్యను అనుకున్నారట.  బాలయ్యతో ఎన్టీఆర్ సినిమా అంటే ఆ ఇద్దరి మధ్య సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.  కల గురించి అభిమానులు పట్టించుకోరు.  సినిమా కోసం ప్రతి ఒక్కరు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు.  అయితే, జనతా గ్యారేజ్ ఒక డిఫెరెంట్ సినిమా.  కథాబలం ఉన్న సినిమా, మెకానిక్ సత్యం పాత్రకు బాలయ్యబాబు సెట్ కారు.  అందుకే బాలయ్యను తీసుకోలేదని కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే.  


ఫ్యూచర్ లో బాలయ్య, ఎన్టీఆర్ తో కలిసి సినిమా ఉంటుందా అంటే ఏమో చెప్పలేం.  ఉండొచ్చు.  ఉండకపోవచ్చు.  ఒకవేళ ఎన్టీఆర్ తో కనుక కొరటాల సినిమా చేస్తే ఆ ఆసినిమాలో బాలయ్యను హీరోగా పెట్టి సినిమా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.  ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ ఏడాది జులై 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు వేరుగా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: