ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. చిన్న హీరో పెద్ద హీరో తేడా లేకుండా అందరూ హీరోలు సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేస్తూ తమ లక్కు  పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన స్టార్ హీరోలైన రజినీకాంత్ మహేష్ బాబు అల్లు అర్జున్ సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. అన్నిటికంటే ముందు విడుదలైన ధర్భర్ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని చాలా ఏళ్ల తర్వాత రజీని  స్థాయిలో హిట్  వచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి  అద్భుత మైన వసూళ్లు రాబడుతోంది. ఇక మొన్నటికి మొన్న విడుదలైన అలా వైకుంటపురములో  సినిమా ప్రేక్షకుల అంచనాలు అన్నింటినీ సంతృప్తి పరుస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 

 

 

 

 కాగా ఈ సంక్రాంతికి విడుదలైన ఏ  సినిమా కూడా సినీ ప్రేక్షకులను నిరాశ పరచలేదు. అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడం తో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోన్నాయి . అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా మాస్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా బన్నీ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది . తొలిరోజు కలెక్షన్లను ఈ ఇద్దరు హీరోలు తమ తమ రికార్డులను తిరగరాశారు. ముందుగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా తొలి రోజు దాదాపు 45 కోట్లు వసూలు చేయగా అలా వైకుంఠపురములో సినిమా 30 కోట్ల వరకు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక సినిమా విడుదలైన నాలుగు రోజులకే సరిలేరు నీకెవ్వరు సినిమా వంద కోట్లకు చేరువగా వెనక... ఈ వారంలోనే ఆ రికార్డు చేరుకుంటుంది. ఇక  అల వైకుంఠపురములో  సినిమా కూడా మరో వారం రోజుల్లో 100 కోట్ల రికార్డును తాకుతుందని సమాచారం. 

 

 

 ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా దర్బార్ ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరి పోయింది. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోనే 20 కోట్లకు పైగా షేర్ సాధించింది దర్బార్ సినిమా. దర్బార్ సినిమా ప్రేక్షకులను ఆకర్షించే సరికి తెలుగు స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పటి కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. కాగా  రేపు సంక్రాంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన మూడు సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో అన్నది ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెలకొన్న ప్రశ్న. అయితే   ఈ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ ప్రభావం కళ్యాణ్ రామ్ సినిమా పై పడనుంది. కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు థియేటర్లకు రప్పించగలదో అన్నది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: