మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్. మొదటి సినిమా పిల్లా నువ్వు లేని జీవితం సూపర్ హిట్ అందుకున్నాడ. మొదటి సినిమాలోనే తన మెగా పవర్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత రేజీనా తో కలిసి సుబ్రమణ్యం ఫర్ సేల్ లో నటించాడు. ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాలు ఒకే జంట కలిసి నటించడం విశేషం. తర్వాత సుప్రీమ్ మూవీతో మంచి హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్ తర్వాత వరుసగా ఆరు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దాంతో తన కెరీర్ కష్టాల్లో పడిందనుకుంటున్న సమయంలో గత ఏడాది చిత్రలహరి మూవీతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు.
తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. వరుస అపజయాలతో చితికిలపడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు తాజా చిత్రం ఎనర్జీని ఇచ్చింది. మారుతీ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజు పండగే’ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం సాధించడంతో సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ నమోదైంది. సాయిధరమ్ తేజ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలించింది.
ఈ నేపథ్యంలో, సాయితేజ్ కు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.ప్రతిరోజు పండగే చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినందుకు శుభాభినందనలు. భవిష్యత్తులో నువ్వు నటించే సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ పవన్ సందేశం పంపారు. దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ … ఎలా స్పందించాలో తెలియడం లేదని… థాంక్స్ చెబితే అది చాలా చిన్న మాట అవుతుందని , “లవ్యూ పవన్ కల్యాణ్ మామా” అంటూ ట్వీట్ చేశాడు.