36ఏళ్ల నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కెరీర్.. కెరీర్ అంటూ.. ఇంతకాలం పెళ్లికి దూరంగా ఉన్న ఈ కుర్రహీరో. ఎట్టకేలకు ఏడు అడుగులు వేస్తున్నాడు. నితిన్ కు కాబోయే సతీమణి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదు. ఆమె ఎవరో బయటకు తెలియకపోయినా.. ఈ ఏడాది సమ్మర్ లో డెస్టినేషన్ మ్యారేజ్ తో ఒక్కటవుతున్నారు. 

తెలుగు ఇండస్ట్రీలో పెళ్లికాని ముదురు బ్రహ్మచారులు నలుగురు ఉన్నారు. ప్రభాస్.. రానా.. నితిన్.. సందీప్ కిషన్ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. అందరీ 30ఏళ్లు దాటిపోయి... 40లోకి దగ్గరపడుతున్నారు. ప్రభాస్ అయితే ఆల్ రెడీ ఎంట్రీ ఇచ్చేశాడు. వీళ్ల ముగ్గురికీ బ్యాచులర్ పార్టీ ఇచ్చి ఓ ఇంటివాడవుతున్నాడు నితిన్. 

 

నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 17ఏళ్లయింది. ప్రస్తుతం ఆయన వయసు 36 సంవత్సరాలు. శ్రీనివాస కల్యాణంలో నటిస్తున్న టైంలో పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టిందని ఆడియో వేడుకలో తన మనసులోని మాట బయటపెట్టాడు. ఈ మాట నిజం చేస్తూ.. ఏప్రిల్ లో పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు నితిన్. 

 

సినిమా ఇండస్ట్రీకి సంబంధంలేని అచ్చమైన తెలుగు అమ్మాయిని పెళ్లాడుతున్నాడు. అమ్మాయి షాలిని అమెరికాలో ఎంబీఏ చేసింది. నాలుగేళ్లుగా వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో.. ఏప్రిల్ 16న డెస్టినేషన్ మ్యారేజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. 

 

నితిన్, షాలిని పెళ్లికి దుబాయ్ వేదిక కానుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఆల్ రెడీ దుబాయ్ లో  ఓ హోటల్ బుక్ చేశారని తెలిసింది. ఏప్రిల్ 14, 15న ప్రీ వెడ్డింగ్ వేడుకకు సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ ప్రస్తుతం భీష్మ సినిమా చేస్తున్నాడు. మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే మూవీ కూడా సెట్స్ పై ఉంది. దీని తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చదరంగం మొదలవుతుంది. ఏడాదిపాటు బిజీగా ఉండే నితిన్.. పెళ్లి కోసం నెల రోజులు గ్యాప్ తీసుకుంటాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: