సంక్రాంతి కానుకగా వచ్చిన రెండు క్రేజీ మూవీస్ సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రెండు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మహేష్ స్టామినా తెలియ చేసేలా సరిలేరు నీకెవ్వరు మాస్ ఆడియెన్స్ ను అలరిస్తుండగా అల వైకుంఠపురములో త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైనర్ గా వచ్చి అలరిస్తుంది. రెండిటి మధ్య గట్టి పోటీ ఉండగా రెండు సినిమాలు హిట్ అవడం ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సరిలేరు కన్నా అల వైకుంఠపురములో ఎక్కువ సందడి చేస్తుంది. 

 

త్రివిక్రమ్ కథ కథనాలకు మాటలకు అల్లు అర్జున్ డిఫరెంట్ స్టైల్ లో మెప్పించాడు.. నా పేరు సూర్య ప్లాప్ తో నిరాశ చెందిన బన్ని అల వైకుంఠపురములో సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు.  మహేష్ సరిలేరు నీకెవ్వరులో బండ్ల గణేష్.. అల వైకుంఠపురములో సినిమాలో సునీల్ జస్ట్ ఏదో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. అసలు సునీల్ చేయాల్సిన పాత్ర కాదని చెప్పాలి.

 

ఇక అల వైకుంఠపురములో సినిమాలో సునీల్ రోల్ కన్నా సరిలేరు నీకెవ్వరు బండ్ల గణేష్ రోల్ మరీ చిన్నదని చెప్పొచ్చు. సినిమా ట్రైన్ ఎపిసోడ్ లో బండ్ల గణేష్ పాత్ర అదిరిపోద్దని అంచనాలు పెంచారు కాని ఆ అంచనాలకు తగిన విధంగా ఆ పాత్రలు లేవని సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ సినిమాలో సునీల్ ఈ మూవీలో బండ్ల గణేష్ ఇద్దరు ఏదో ఉన్నామంటే ఉన్నారు తప్ప సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. 

 

అల వైకుంఠపురములో అయినా సునీల్ జస్ట్ ఓకే అనిపించగా బండ్ల గణేష్ మాత్రం ఏదో ఒక చిన్న పాత్రకే పరిమితం అయ్యాడు. అసలే సరిలేరు నీకెవ్వరు సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు పెంచారు కాని బండ్ల గణేష్ ఎపిసోడ్ మాత్రం పూర్తిగా నిరాశపరచింది. కొన్నాళ్లుగా సినిమాకు దూరంగా ఉన్న బండ్ల గణేష్సినిమా తో లైమ్ లైట్ లోకి వస్తని అనుకోగా అది వర్క్ అవుట్ అవలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: