బండ్ల గణేష్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.. ఇప్పుడంటే నిర్మాతగా మారాడు గాని తన ప్రస్దానం మాత్రం ఒక నటుడిగా ప్రారంభించారు. అదికూడా చిన్న నటుడిగా చాలా కాలం కొనసాగాడు.. ఇక ఇతను సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, 143 లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించడమే కాకుండా, నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో, టెంపర్, మొదలగు చిత్రాలు నిర్మించాడు.

 

 

అంతే కాకుండా 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు... ఇక  కొన్ని రోజులకి పూర్తిగా రాజకీయాలకి రాజీనామా చేశారు. ఇకపోతే బండ్ల గణేష్ ఎన్నికలప్పుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే అదే కామెడీని తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో ఓ దొంగ పాత్రలో నటించిన గణేష్, ట్రైన్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాల్లో కేవలం ఓ పది నిముషాలు మాత్రమే కనిపిస్తారు.

 

 

ఇకపోతే అంతగా పండని కామెడీ సీన్లోకి అనవసరంగా గణేష్‌ను ఇరికించాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ పాత్ర కోసం అయనకి 20 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంతో 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ ఇస్తూ భారతి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించారు.

 

 

ఇక సినిమా విషయానికి వచ్చేసరికి పక్కా కమర్షియల్ ఫార్ములాగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ రోల్ లో కనిపించారు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 11 న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతుంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: