మాస్ మహారాజ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా క్రాక్. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. నిజానికి గతంలో రవితేజ, గోపీచంద్ ల క్రేజీ కాంబినేషన్లో డాన్ శ్రీను, బలుపు సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో డాన్ శ్రీను ఫ్లాప్ అవ్వగా బలుపు సినిమా మంచి హిట్ కొట్టింది. మరి మూడవ సారి వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి. 

 

రవితేజ ఒక క్రాక్ పోలీస్ ఆఫిసర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మంచి మాస్, కమర్షియల్ హంగులతో పాటు పలు యాక్షన్ సీన్ల మేళవింపుగా దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక గతంలో రవితేజ, శృతి హాసన్ ల కలయికలో వచ్చిన బలుపు సూపర్ హిట్ కొట్టడంతో, చాలా రోజుల తరువాత మళ్ళి వీరిద్దరూ జతకడుతుండడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని రవితేజ ఫ్యాన్స్ తో పాటు శృతి ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. ఇక ఎక్కువగా రవితేజ సినిమాలకు సంగీతాన్ని అందించే థమన్, ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ని అందిస్తున్నట్లు టాక్. 

 

ఇకపోతే నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ ని కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ పోస్టర్ లో రవితేజ, శృతిహాసన్ ఇద్దరూ కూడా బైక్ ముందు ఒక బాబును కూర్చో పెట్టుకుని వెళ్తున్న సీన్ ని గమనించవచ్చు. ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ పోస్టర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: