టాలీవుడ్ యువ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎంత మంచివాడవురా. అల్లరినరేష్ హీరోగా తెరకెక్కిన దొంగలబండి సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత సతీష్ వేగేశ్న, తొలి సినిమాతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ తరువాత కులుమనాలి, రామదండు వంటి సినిమాలు తీసి ఫ్లాప్స్ చవిచూసిన సతీష్, అనంతరం కొంత బ్రేక్ తీసుకుని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా శతమానంభవతి అనే సినిమాను తీయడం జరిగింది. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఆ సినిమాకు బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక ఆ తరువాత నితిన్ తో శ్రీనివాస కళ్యాణం అనే సినిమా తీసినప్పటికి అది పెద్ద సక్సెస్ కాలేదు. 

 

ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఎంత మంచివాడవురా అనే కుటుంబ కథ చిత్రాన్ని తీసాడు సతీష్. ఈ సినిమాలో బంధాలు, అనుబంధాలతో పాటు యక్షన్, ఫైట్స్ కూడా మేళవించినట్లు సతీష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ మంచి సక్సెస్ సాధించి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రీమియర్ షోల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మంచి టాక్ లభిస్తునంట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ, రొమాంటిక్ సీన్స్ తో సినిమా సాగుతుందని, అలానే కొంత ఎమోషనల్ వేలో మంచి పాయింట్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్ వస్తుందని, దానితో సెకండ్ హాఫ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు. 

 

ఇక ఒకింత మెల్లగా ప్రారంభం అయ్యే సెకండ్ హాఫ్, అనంతరం పుంజుకుంటుందని, ఆపై వచ్చే హృద్యమైన సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, మనసుని హత్తుకునే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ తో మొత్తంగా ఒక మంచి సినిమాని చూశామనే ఫీల్ ప్రేక్షకులకు ఈ సినిమా కలిగిస్తుందని చెప్తున్నారు. ఇక హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో అద్భుత నటనను కనబరిచారని, గతంలో వచ్చిన సతీష్ వేగేశ్న సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సంక్రాంతికి మంచి సక్సెస్ ని సాదిస్తుందని అంటున్నారు. మరి ఈరోజు పడబోయే షో ల అనంతరం పూర్తి టాక్ బయటకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: