ఆ మద్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన ‘బలుపు’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఈ మూవీలో రవితేజగ్యాంగ్ స్టర్ గా నటించారు.  తాను ప్రేమించిన  యువతి కోసం పూర్తిగా మారిపోయి..  అజ్ఞాతంలోకి వెళ్లి మంచి యువకుడిగా మారుతాడు.  ఈ మూవీలో ప్రకాశ్ రాజ్ అద్భుతమైన నటన ప్రదర్శించిన విషయం తెలిసిందే.  ఈ మూవీలో ప్రేమించిన యువతిగా అంజలి.. తర్వాత రవితేజను ప్రేమించే పాత్రలో నటించారు.  బలుపు తర్వాత రవితేజకు పెద్దగా హిట్ సినిమాలు పడలేదు.  దాంతో రెండేళ్లు గ్యాప్ తీసుకొని అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీలో నటించాడు. 

 

మూవీ సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత రవితేజ నటించిన సినిమాలన్నీ వరుస అపజయాలు పొందాయి.  దాంతో తరువాత సినిమాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ మూవీలో నటిస్తున్నారు రవితేజ.  ఈ మూవీకి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఈ మూవీ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో  ‘క్రాక్’ మూవీలో నటిస్తున్నారు రవితేజ.  ఈ మూవీలో రవితేజ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారట.  ఓ యధార్థ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

 

గతంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమాలకు మంచి క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే.  అయితే ఆ మద్య రిలీజ్ అయిన టచ్ చేసి చూడు మాత్రం ఈ మాస్ మహరాజకు అస్సలు కలిసి రాలేదు.  ప్రస్తుతం నటిస్తున్న డిస్కోరాజా మంచి హిట్ టాక్ వస్తే... ఆ ప్రభావం క్రాక్ పై కూడా ఉండొచ్చని అంటున్నారు.  బలుపులో నటించిన శృతిహాసన్  ఈ మూవీలో నటిస్తుంది.  మరి బలుపు లాంటి సక్సెస్ క్రాక్ అందుకుంటుందా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: