ప్రస్తుతం మంచి పేరుతో దూసుకెళ్తున్న టాలీవుడ్ సంగీత దర్శకుల్లో అందరికంటే ఒకింత ముందున్న సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అనే చెప్పాలి. నిజానికి రవితేజ నటించిన కిక్ అనే సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్న థమన్, ఆ తరువాత పలువురు స్టార్ నటుల సినిమాలకు పని చేయడం జరిగింది. అయితే అప్పట్లో థమన్ మ్యూజిక్ పై కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనే కొంత విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అవేవి పెద్దగా లక్ష్య పెట్టని థమన్, మధ్యలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చుకుంటూ ముందుకు సాగాడు, అయినప్పటికీ తనపై అటువంటి విమర్శలు తగ్గకపోవడంతో బన్నీ నటించిన సరైనోడు తరువాత కొంత విరామం తీసుకుని తనను తాను ఎంతో మార్చుకుని, 

 

సరికొత్తగా సిద్ధం అయిన థమన్, ఆ తరువాత వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ, అలానే శర్వానంద్ మహానుభావుడు సినిమాలకు సూపర్ ట్యూన్స్ అందించడంతో పాటు ఆ సినిమాలు కూడా సక్సెస్ కొట్టడంతో మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. ఇక అక్కడినుండి అలరించే మ్యూజిక్ ఇస్తూ మరింత మంచి పేరుతో దూసుకెళ్తున్న థమన్, ఇటీవల బన్నీ, త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాకు మాత్రం ఎవ్వరూ కూడా ఊహించని రేంజ్ లో అద్భుతమైన సాంగ్స్ అందించి ఆడియన్స్ నుండి విపరీతమైన అప్లాజ్ సంపాదించాడు. ఇక ప్రస్తుతం థమన్ చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయి. అయితే తన కెరీర్ లో ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం వర్క్ చేయని థమన్, తొలిసారిగా ఆయన అతి త్వరలో నటించనున్న పింక్ మూవీ రీమేక్ కు సంగీత దర్శకుడిగా ఇటీవల ఎంపికయ్యాడు. పవన్ గారితో తొలి సినిమా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన తమన్

 

ఇటీవల అలవైకుంఠపురములో సాంగ్స్ తో పాటు మూవీ కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ కొట్టడంతో, అల్లు అర్జున్ అర్జున్ కు మరియు థమన్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందనలు తెల్పుతూ బొకేలు పంపారు. ఇక ఆ ఆనందాన్ని పట్టలేని థమన్, పవర్ స్టార్ పంపిన బొకేని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ కు షేర్ చేసాడు. కాగా పవన్ బొకే పంపారని ఆనందిస్తున్న థమన్, తమ హీరోతో చేస్తున్న తొలి సినిమాకు కూడా అదిరిపోయే రేంజ్ లో ట్యూన్స్ ఇవ్వాలని కోరుతూ పలువురు పవన్ ఫ్యాన్స్, థమన్ కు ట్వీట్స్ చేస్తున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ఆశలను థమన్ బాబు ఎంతవరకు నెరవేరుస్తాడో తెలియాలంటే, ఆ సినిమా సాంగ్స్ రిలీజ్ అయ్యే వరకు ఓపిక పట్టాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: