సంక్రాంతి పండుగ సందర్బంగా స్టార్ సినిమాల రిలీజ్ హంగామా తెలిసిందే. జనవరి 9న దర్బార్ తో మొదలైన ఈ సంక్రాంతి సినిమాల జోరు ఈరోజు రిలీజ్ అవుతున్న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాతో సహా ఈసారి అన్ని సినిమాలు అంచనాలకు తగినట్టుగా ఉన్నాయ్. ఎప్పుడు సంక్రాంతి బరిలో దిగే సినిమాల్లో ఒకటి హిట్టు మరోటి ఫట్టు అనేలా ఉంటాయి. కాని ఈసారి అన్ని సినిమాలు అలరిస్తున్నాయి. 

 

దర్బార్ రజిని స్టైల్ కు తగినట్టుగా సినిమా తెరకెక్కించాడు మురుగదాస్. కొన్నాళ్లుగా రజిని ఫ్యాన్స్ మిస్ అవుతున్న ఆయన స్టైల్ ను ఈ సినిమాతో చూపించారు. ఇక సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చింది. అనీల్ మార్క్ ఎంటర్ టైన్మెంట్.. మహేష్ మాస్ ఇమేజ్ ఈ సినిమాకు సూపర్ హిట్టు కొట్టాయి. 

 

ఇక ఈ సంక్రాంతికి వచ్చిన మరో క్రేజీ మూవీ అల వైకుంఠపురములో. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అందుకుంది. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత తీసిన సినిమా ఇది. ఒక సినిమా హిట్టు కొట్టడానికి ఏమేమి అంశాలు కావాలో అన్ని ఈ మూవీలో ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ డిఫరెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించాడు. 

 

ఈరోజు రాబోతున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్  లో తెరకెక్కిన ఈ మూవీపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు నచ్చితేనే ఏ సినిమా అయినా హిట్ అయ్యేది. అయితే ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ప్రేక్షకులని మెప్పించేలా ఉన్నాయి. అందుకే సినిమాలా వసూళ్లు కూడా బాగున్నాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: