అల్లూ అర్జున్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు మెగా స్టార్ మేనల్లుడిగా, మెగా ఫ్యామిలీ నుంచీ వచ్చిన హీరోగా అందరికి పరిచయం అయ్యాడు. పవన్ కళ్యాణ్ తరువాత మెగా కాంపౌండ్ నుంచీ వచ్చిన హీరోలలో రెండవ వ్యక్తి అల్లూ అర్జున్. మొదట్లో ఈ హీరోకి అంతగా ప్రేక్షక ఆదరణ లేకపోయినా మెగాస్టార్ అనే బ్రాండ్ ఇమేజ్ తో నెట్టుకొచ్చేశాడు. కానీ ఒక్కో సినిమాకి పెర్ఫార్మెన్స్ చూపిస్తూ, ఎంతో ట్రెండీగా ఉంటూ, స్టైల్ స్టార్ అల్లూ అర్జున్ గా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని మాస్,క్లాస్ ప్రేక్షకుల ఆదరణని అమాంతం పెంచుకున్నాడు బన్నీ.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ALLU ARJUN' target='_blank' title='allu arjun-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>allu arjun</a> with chiru

గడించిన రెండు మూడేళ్ళ కాలంలో అల్లూ అర్జున్ ఇమేజ్ అమాంతం మెగా ఫ్యామిలీ బ్రాండ్ ఇమేజ్ దాటుకుంటూ ఎదిగిపోయిందని , ఒక రకంగా చిరు తనయుడు చరణ్  ఇమేజ్ కంటే కూడా బన్నీ ఇమేజ్ ఎక్కువనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ క్రమంలోనే బన్నీ తనదైన శైలిలో ఇండస్ట్రీ లో తన మార్క్ అంటే అల్లూ మార్క్ చూపించడానికి  అడుగులు వేస్తున్నట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ALLU ARJUN' target='_blank' title='allu arjun-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>allu arjun</a> speech

ఎలాగో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. పైగా తండ్రి  భారీ చిత్రాల నిర్మాత, ఏకంగా ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండగా ఉంది. కాబట్టి మెగా ఇమేజ్ నుంచీ ఇప్పుడు బన్నీ బయట పడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. అంతేకాదు మెగా హీరోలతో ఈ మధ్య కాలంలో కలవడం లేదని, వారి సినిమా ఫంక్షన్ లకి కూడా బన్నీ హాజరుకావడం లేదని, అలాగే మొన్నటి అల ఆడియో ఫంక్షన్ వేదికపై పవన్ పేరు ప్రస్తావించకుండా, కేవలం చిరు పేరు ప్రస్తావిస్తూ, రజనీకాంత్ నాకు ఇష్టమైన రెండో వ్యక్తి అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులుని చీల్చుతూనే, తానొక ప్రత్యేకమైన హీరోగా ప్రకటించుకునే ప్రయత్నం చేశాడని అందుకు కారణం మెగా బ్రాండ్ ఇమేజ్ చేరిపెసుకునే క్రమంలో భాగమనేది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా బన్నీ ఈ మధ్య కాస్తా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడనేది టాలీవుడ్ టాక్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: