నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎంత మంచివాడవురా. కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శతమానం భవతి సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణంతో నిరాశ పరచాడు. కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా సినిమా తీసిన సతీష్ వేగేశ్న ఈ సినిమాను ఆశించిన స్థాయిలో తీయలేదు.

 

సినిమా కథ డిఫరెంట్ గా అనిపించినా దాన్ని తెర మీదకు తీసుకెళ్లిన విధానం మెప్పించలేదు. సినిమా మరీ సీరియల్ లాగా సాగదీశాడని తెలుస్తుంది. కథకు తగిన కథనం కుదిరినప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. అలా కాకుండా కథ ఎంత బాగున్నా కథనం తేడా కొడితే ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద పడుతుంది. శతమానం భవతి సినిమాలానే కుటుంబ విలువలు చెప్పాలని చుసినా ఈ సినిమాలో ఎందుకో అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

 

సతీష్ వేగేశ్న ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా సినిమాలో సీన్స్ ఉండటం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. అసలే సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రెండు సూపర్ హిట్ అవడంతో ఎంత మంచి వాడవురా మీద ఎఫెక్ట్ పడింది. ఓ రేంజ్ లో ఉంటేనే కాని సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి టైమ్ లో కేవలం కథ మాత్రమే బాగుంది కథనంలో ట్రాక్ తప్పిన ఎంత మంచివాడవురా సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

లాస్ట్ ఇయర్ 118 సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ హిట్ మ్యానియా కొనసాగిస్తాడని అనుకుంటే నిరాశపరచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: