మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైఫై యాక్షన్ మూవీ 'డిస్కో రాజా'. ఈ నెల 24 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీజర్.. ట్రైలర్లు.. లిరికల్ సాంగ్స్ తో సినిమాపై హైప్ పెంచుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ డేట్ టైం ఫిక్స్ చేశారు. 'రం పం బం' అంటూ సాగే ఈ పాటను జనవరి 16 వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని 'డిస్కో రాజా' టీమ్ తాజాగా వెల్లడించింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడనే సంగతి తెలిసిందే. 

 

ఈమధ్య తమన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తమన్ సంగీతంలో వచ్చిన పాటలు సూపర్ హిట్స్ గా నిలవడమే కాకుండా సినిమాకి ప్రధాన బలంగా ఉంటూ సాంగ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే 'డిస్కో రాజా' ఈ పాట మాత్రం తమన్ కెరీర్ లో ఒక స్పెషల్ సాంగ్ కానుందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ పాటను మాస్ మాహారాజా రవితేజ.. నాటి తరంలో బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన బప్పీలహరి కలిసి పాడుతున్నారు. బప్పీలహరికి డిస్కో కింగ్ అని అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో గొప్ప పేరుంది. బప్పీలహరి కంపోజ్ చేసిన డిస్కో పాటలు.. ఇండియాను షేక్ చేసిన సందర్భాలు బోలెడన్ని ఉన్నాయి. అలాంటి బప్పీలహరితో ఈ డిస్కో రాజా 'రం పం బం' పాటను పాడించడం ఒక స్పెషల్ అట్రాక్షన్ అని మ్యూజిక్ లవర్స్ చెప్పుకుంటున్నారు.

 

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే 'నువ్వు నాతో ఎమన్నావో'.. 'ఢిల్లీవాలా' పాటలు రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. మరి ఈ కొత్త పాట కూడా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్.. నభ నటేష్.. తాన్యా హోప్..బాబీ సింహ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇక బప్పీలహరి సూపర్ స్టార్ కృష్ణ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన సింహాసనం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తో రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, బాలకృష్ణ లారీ డ్రైవర్.. సినిమాలకి సంగీతమంది సూపర్ హిట్స్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: