అల్లు హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక నిర్మాత కొడుకుగా కాకుండా సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆర్య నుండి అల వైకుంఠపురములో వరకు అల్లు అర్జున్ తన కెరియర్ బెస్ట్ అవుట్ పుట్ ఇస్తూ వస్తున్నాడు. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అనేలా బన్ని తన ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బన్ని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. జులాయి టైం లో 40 కోట్ల వరకే ఉన్న బన్ని మార్కెట్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన సరైనోడు సినిమాతో 70 కోట్లకు పెంచుకున్నాడు.

 

సినిమా తర్వాత వచ్చిన డిజే యావరేజ్ గా నిలిచింది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమా బన్ని స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే 75 కోట్ల షేర్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. కరెక్ట్ సినిమా పడితే బన్ని సత్తా ఏంటో చూపిస్తుందని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ అల వైకుంఠపురములో. ఈ సినిమాతో బన్ని మాత్రమే కాదు త్రివిక్రం కూడా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు.

 

భారీ అంచనాలతో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అవగా ఆ తర్వాత తారక్ తో చేసిన అరవింద సమేత సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక ఈసారి కొడితే గట్టిగా కొట్టాలన్న త్రివిక్రం కసి కూడా తోడైనా బన్ని అల వైకుంఠపురములో సినిమాను సెన్సేషనల్ హిట్ కొట్టారు. అల్లు అర్జున్ కెరియర్ లో ఈ సినిమా వసూళ్లలో మొదటిస్థాయిలో నిలబడటం విశేషం. జస్ట్ ఫోర్ డేస్ లో హయ్యెస్ట్ షేర్ అంటే ఈ సినిమాతో బన్ని సెన్సేషనల్ రికార్డ్ కొట్టబోతున్నాడని మాత్రం అర్ధమవుతుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాల కన్నా ఎక్కువ హిట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: