సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమాను కలెక్షన్స్ పరంగా నిలబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు ‘సరిలేరు’ టీమ్ చేస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగా దర్శకుడు అనీల్ రావిపూడి మరియు మహేష్ బాబులను స్టార్ హీరో వెంకటేష్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియొ ఇప్పుడు యూట్యూబ్ లో హడావిడి చేస్తోంది. 

ఇప్పటి వరకు వెంకటేష్ బయట హీరోలకు సంబంధించిన సినిమాలను ప్రమోట్ చేయాడానికి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అయితే మహేష్ వెంకటేష్ లకు ఉన్న సానిహిత్యం రీత్యా వెంకటేష్ మహేష్ అభ్యర్ధనను కాదనలేకపోయసాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి వెంకటేష్ మాట్లాడిన మాటలు వారిద్దరి మద్య జరిగిన సరదా కామెంట్స్ అందరికీ తెగ నవ్వు తెప్పించాయి.   

ముఖ్యంగా వెంకటేష్ మాట్లాడుతూ మహేష్ బాబు లుంగీ డాన్స్ పై హాట్ కామెంట్స్ చేశాడు. మైండ్ బ్లాంక్ సాంగ్ లో మహేష్ బాబును చూసిన లేడీస్ జోష్ లోకి వెళ్ళిపోతున్నారు అంటూ సాదారణంగా  చాలామంది  మగవాళ్ళు హీరోయిన్స్ ను ఎలా అయితే పొట్టి డ్రస్ లు వేసుకుంటే చూస్తారో అలాగే మైండ్ బ్లాంక్ పాటలోని మహేష్ బాబును ఆడవారు అలా చూస్తున్నారు అంటూ జోక్ చేసి నవ్వులు పూయించాడు. 

వెంకటేష్ చేసిన ఈకామెంట్స్ సరదాగా ఉన్నప్పటికీ ‘మైండ్ బ్లాంక్’ పాటకు మహేష్ వేసిన స్టెప్స్ వెంకీ మామకు కూడ నచ్చాయి అన్న అభిప్రాయం కూడ కలిగేలా చేస్తోంది. మహేష్ బాబు 20 ఏళ్ల సినీ కెరీర్ లో నటించిన ఏసినిమా పాటకు రానంత స్పందన ఈ పాటకు వస్తున్నా మహేష్ లుంగీ డాన్స్ సెంటిమెంట్ ‘సరిలేరు నీకెవ్వరు’ ను బ్లాక్ బష్టర్ హిట్ గా మార్చలేకపోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో మహేష్ సంక్రాంత్ రేస్ విన్నర్ కాకపోయినా అతడి మ్యానియా మాత్రం కొనసాగుతూనే ఉంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: