ఏపీలో అమరావతి కోసం ఆందోళనలు జరుగుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిల్వ‌ర్ స్క్రీన్‌ రీ ఎంట్రీ కూడా ఫిక్స్ అయింది. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత పవన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇవ్వటంలో అభిమానులు ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వెండితెరపై సందడి చేయనున్నారు. హిందీలోనూ, తమిళంలోనూ విజయవంతమైన `పింక్` రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు.

 

ఇక అయితే ఈ సినిమాని జనవరి 20న సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని, ఫిబ్ర‌వ‌రిలో ప‌వ‌న్ టీంతో జాయిన్ కానున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని సమాచారం. అదే సమయంలో పవన్-దిల్ రాజు సినిమా విడుదలకు కూడా ముహుర్తం ఫిక్స్ అయిపోయినట్లు బోగట్టా. రంజాన్ సందర్భంగా, సమ్మర్ స్పెషల్ గా మే 23న పింక్ రీమేక్ ను విడుదల చేయడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. 

 

అలాగే ప‌వ‌న్ ఇమేజ్‌కి అనుగుణంగా క‌థ‌లో మార్పులు చేసిన చిత్ర బృందం సినిమాకు కీల‌క‌మైన కోర్టు సెట్‌ని భారీగా నిర్మిస్తున్న‌ట్టు తెలిసింది. ఇందు కోసం కోర్టు సెట్‌ని అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌లో ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ నేతృత్వంలో నిర్మిస్తున్నారు. మ‌రోవైపు ఈ చిత్రానికి కేవ‌లం 20 రోజుల్ని మాత్ర‌మే ప‌వ‌న్ కేటాయించిన‌ట్టు చెబుతున్నారు. కాగా,ఈ సినిమాలో పవన్ సరసన పూజా హేగ్దేని ఫిక్స్ చేశారట.. ఇక ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కథ చర్చలు కూడా అయిపోయాయని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: