టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో సినిమా ఇప్పటికే థియేటర్స్ లోకి వచ్చి మంచి సక్సెస్ తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ కలిసి సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మించారు. మంచి ఎమోషన్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తన గత సినిమా అరవింద సమేతను తెరకెక్కించిన త్రివిక్రమ్, ఈ అలవైకుంఠపురములో సినిమాను మంచి యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, అదిరిపోయే పంచ్ డైలాగ్స్ కలగలిపి తెరకెక్కించాడు. 

 

బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా సాంగ్స్ కు శ్రోతల నుండి విశేషమైన స్పందన లభించడంతో పాటు యూట్యూబ్ లో కూడా అత్యధిక స్థాయిలో లైక్స్, వ్యూస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అన్నిటికీ ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ఎంతో బాగుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా సిద్ శ్రీరామ్ ఆలపించిన సామజవరగమనా, అనురాగ్ కులకర్ణి పాడిన రాములో రాములా సాంగ్స్ ఎంతో పెద్ద సక్సెస్ సాధించాయి. 

 

ఇక వీటిలో ఇప్పటికే సామజవరగమనా సాంగ్ కు యూట్యూబ్ లో 1 మిలియన్ లైక్స్ లభించగా, నేడు రాములో రాములా సాంగ్ కు 1 మిలియన్ లైక్స్ లభించి టాలీవుడ్ కెరీర్ లోనే రెండు 1 మిలియన్ లైక్స్ దక్కించుకున్న సాంగ్స్ గా అద్భుత రికార్డ్స్ నెలకొల్పడం జరిగింది. ఇక ఇప్పటికే సినిమా మంచి సక్సెస్ సాధించి ఉండడంతో, నేడు రాములో రాములా సాంగ్ ఈ అద్భుతమైన ఫీట్ ని అందుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు ఆ సాంగ్ ని మరింతగా సోషల్ మీడియా అకౌంట్స్ లో వైరల్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: