2014 ఎన్నికల్లో జనసేన పార్టీని స్థాపించి చంద్రబాబుతో చేతులు కలిపి సందర్భంలో టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి ప్రధాన కారణాలలో ఒక కారణమయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎన్నికలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అటు రాజకీయ రంగం ఇటు సినిమా రంగంలోనూ సంచలనం సృష్టించింది.

 

దీంతో పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో చాలామంది ఇంకా రాజకీయాలు విరమించుకుని సినిమాలు చేస్తారని అందరూ భావించిన తరుణంలో తన కట్టె కాలే వరకు చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల కోసమే పోరాడుతానని చెప్పి సినిమాలు తీయడం ఉండదు అని డైలాగ్ లు వేసిన పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల బిజెపి పార్టీ లో జనసేన పార్టీని కలిపి ప్రస్తుతం సినిమా రంగంపై దృష్టి సారించినట్లు సమాచారం.

 

మేటర్ లోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయినపింక్సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సినిమాకి దాదాపు 50 కోట్ల మేరకు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

 

అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు అదేవిధంగా సినిమాని దిల్ రాజు నిర్మించనున్నట్లు వచ్చే సమ్మర్ కల సినిమా విడుదల చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం. దీంతో త్వరలోనే సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు అని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అంతా అనుకున్నట్టు సినిమా షూటింగ్ జరిగితే మే నెల చివరి వారంలో సినిమా విడుదల చేయాలని సినిమా యూనిట్ ప్లాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: