ఈ మద్య తెలుగు బుల్లితెరపై వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే.. సినిమాల్లో కూడా ఇన్ని రంగులు ఉండవు అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంకర్లు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.. అందులోనూ జబర్ధస్త్, ఫటాస్,అదిరింది కార్యక్రమాల్లో వస్తున్న యాంకర్ల జోష్ చూస్తుంటే హీరోయిన్లు సైతం ఔరా అనిపించేలా ఉన్నాయి. ఇక జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన యాంకర్ అనసూయ ప్రస్తుతం ఇతర ఛానల్స్ లో బిజీగా ఉంది. తన గ్లామర్ మొత్తం చూపించి ‘జబర్ధస్త్’ షో ను పిక్ స్టేజ్ కి తీసుకెళ్లింది.  అంతే కాదు.. వెండితెరపై కూడా తన అందాలు ఆరబోస్తుంది.   తాజాగా ఇప్పుడు ఆ షో నుండి బయటకొచ్చి లోకల్ గ్యాంగ్స్ లో చేరింది.

 

ఈ షో ను కూడా జబర్దస్త్ తరహాలో తీసుకెళ్లాలని గట్టిగానే కష్టపడుతుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు టివి ఛానల్స్ లో అదరగొడుతుంది. ఇక ఫోటో షూట్స్ సంగతి సరే సరి. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగ‌స్థ‌లం మూవీతో రంగ‌మ్మ‌త్త‌గా మంచి పేరు తెచ్చుకుంది.   ఈమూవీ సక్సెస్ తర్వాత అనసూయకు వరుసగా సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  అనసూయ అప్పుడప్పుడు స్టేజ్ షోలు ఇవ్వడం సహజం.. అయితే ఈ మద్య ఈ అమ్మడు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.  తాజాగా ఒక షోలో ఏకంగా స్టెప్పులేసేసి అదరగొట్టేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చి హడావుడి చేస్తోంది.

 

జ‌బ‌ర్ద‌స్త్‌లో చిన్ని చిన్ని డ్ర‌స్సుల‌తో అల‌రిస్తున్న ఈ అమ్మ‌డు నాగ‌బాబుతో పాటు జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్‌బై కొడుతోంది అన‌సూయ అని అంతా అనుకున్నా, ఈ టివిలో చేస్తునే... అటు జీ తెలుగులోనూ త‌న మార్కు చూపించే ప‌నిలో ప‌డింది. ఒకప్పుడు వెంకటేష్, దివ్యభారతి నటించిన ‘బొబ్బిలి రాజా’ మూవీలో   హిట్ సాంగ్ బలపం పట్టి భామ ఒళ్లో పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసిన అనసూయ.. తన నడుమందాల్ని చూపించి ఘాటెక్కించారు. ప్రస్తుతం ఈ ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: