సంక్రాంతికి పండుగ వేళ పెద్ద సినిమాల హంగామా భారీగా ఉంటుంది. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి నాడు స్టార్ సినిమాలు రిలీజైతే ఆ కిక్కే వేరు. ఈసారి కూడా సంక్రాంతికి స్టార్ సినిమాలు వరుస కట్టాయి. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ సినిమాతో మొదలై కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమాతో పూర్తయ్యాయి. మహేష్, అల్లు అర్జున్ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కాగా అవి కేవలం తెలుగులోనే రిలీజ్ అయ్యాయి. రజిని సినిమా దర్బార్ తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేశారు.

 

మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కేవలం తెలుగు వరకే రిలీజ్ చేశారు. మహేష్ తో పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నా అది మాత్రం కుదరడం లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా కేవలం తెలుగు వరకే పరిమితం చేశాడు. ఇక మహేష్ తో పోల్చుకుంటే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా మళయాల వర్షన్ వచ్చింది. అక్కడ బన్నికి ఉన్న క్రేజ్ దృష్యా ఆ సినిమా రిలీజ్ చేశారు. అంతేకాని అది పాన్ ఇండియా రేంజ్ లో చేయలేదు.

 

ఎలాగు సంక్రాంతి సీజన్ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంటుంది. అలాంటిది ఎందుకు మన హీరోలు పాన్ ఇండియా సినిమా చేయట్లేదన్నది మాత్రం తెలియట్లేదు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ఆ విధంగా చేయలేదు. అయితే ఈ ఇయర్ మిస్సైనా నెక్స్ట్ ఇయర్ అయినా సంక్రాంతిని మరింత క్యాష్ చేసుకునేలా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తే బెటర్ అని అంటున్నారు సిని విశ్లేషకులు. ఎలాగు బాహుబలితో తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో కూడా మార్కెట్ బాగా ఉంటుంది.. సాహో కూడా తెలుగులో నిరాశ పరచినా హిందీలో మంచి వసూళ్లు తెచ్చింది. ఎలాగు ఈ ఇయర్ rrr తో మరోసారి రాజమౌళి పాన్ ఇండియా మూవీతో వస్తున్న విషయం తెలిసిందే. అయితే పండుగ టైం కు వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: