టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎంత మంచివాడవురా మొన్న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కుటుంబ కథా సినిమాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీదేవి మూవీ, ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. అయితే ఓవరాల్ గా పర్వాలేదనిపించే టాక్ ని సంపాదించిన ఈ సినిమాపై చాలా వరకు ప్రేక్షకులు నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు ప్రేక్షకులు. తనకు మాదిరిగా ఇతరులు కూడా అనాధల వలే ఫీల్ కాకూడదని, ఎమోషన్స్ ని సరఫరా చేసే కంపెనీని హీరో నెలకొల్పడం బాగుందని, 

 

అయితే ఆ పాయింట్ ని దర్శకుడు సతీష్ ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తీయలేదని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయమై మీడియాతో మాట్లాడిన నందమూరి కళ్యాణ్ రామ్, ఇది తన మొదటి సంక్రాంతి చిత్రం అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన ఇదే మాటపై కొందరు నెటిజన్లు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నిజానికి గతంలో బాలకృష్ణ హీరోగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు గత సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిందని, 

 

అయితే ఆ సమయంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఇది తన తొలి సంక్రాంతి సినిమా అని చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఆ సినిమాలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్, ఆ విషయం మరిచి ప్రస్తుతం రిలీజ్ అయిన ఎంత మంచివాడవురా సినిమా తన తొలి సంక్రాంతి సినిమా అని చెప్పడం విడ్డూరంగా ఉందని, అయితే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఫ్లాప్ కావడంతో కళ్యాణ్ రామ్ ఈ విధంగా చెప్పారా ఏంటి అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: