సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినీ పరిశ్రమకు చాలా ముఖ్యమైన ఘట్టం. పండుగ రోజుల్లో రాష్ట్రంలోని ప్రజలంతా థియేటర్ల ముందు వాలిపోతారు. సంవత్సరం కూడా సంక్రాంతికి పోటీ తారాస్థాయిలో ఉంది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం మరియు అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురం లో ప్రేక్షకులను అలరించగా... కేవలం ఒక వారంలోనే రెండు చిత్రాలు తమ పెట్టుబడిని తిరిగి రాబట్టుకుని లాభాల బాట పట్టాయి.

 

అయితే పండగ రోజు మొత్తం విపరీతంగా కుమ్మేసిన రెండు చిత్రాలకు ఇప్పుడు ఒక్కసారిగా వణుకు పట్టుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చాలా బాగా రాణించి కేవలం ఒక్క వారంలోనే లాభాల బాట పట్టగా ఇక నుండి వారికి అసలు పరీక్ష మొదలైంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంత మంచి వాడవురా చిత్రం బయట నెగిటివ్ టాక్ మరియు తక్కువ రేటింగ్ సాధించినప్పటికీ కూడా వసూళ్ల విషయంలో విధంగా తగ్గట్లేదు.

 

సంక్రాంతి పండుగకు జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పండుగకు ఫ్యామిలీ మరియు బంధువులతో కలిసి కచ్చితంగా ఏదో ఒక సినిమాకి వెళ్ళాలి అన్నట్లు. ఇదే సమయంలో ఉన్న థియేటర్లలో సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠ పురం లో హౌస్ ఫుల్ బోర్డులు పెడుతుంటే మిగిలినవారు గత్యంతరంలేక కళ్యాణ్ రామ్ సినిమాకి వెళ్తున్నారు. సినిమాలో ఒక కుటుంబ కథా చిత్రానికి కావాల్సిన నిండుతనం ఉండడంతో మిగిలిన వారంతా వారి బాట పట్టడం గమనార్హం. ఇలా మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ సినిమాలు కి రావాల్సిన మిగతా డబ్బులను కళ్యాణ్ రామ్ దండుకుంటున్నాడు. ఇదే కొనసాగితే ఇక వేరే వారిద్దరికి కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: