రాత్రి ఏడున్నర అయిందంటే చాలు తెలుగింట దాదాపు ప్రతి ఇంటిలోనూ కార్తీకదీపం సీరియ‌ల్‌ మొదలవ్వల్సిందే. ఎన్ని పనులున్నా సరే ఆ సమయానికి మహిళా మణులు వారికి తోడుగా ఇంటిల్లపాదినీ టీవీల ముందు కట్టిపాడేస్తోంది కార్తీకదీపం సీరియల్. సీరియల్ ద్వారా తెలుగు ఆడపడుచుల్లో ఒక్కరిగా  దీప అలియాస్ వంటలక్క మారిపోయింది. బుల్లితెర బాహుబలిగా తెలుగు ప్రేక్షకుల‌ను క‌ట్టిప‌డేస్తూ టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ సీరియల్ దెబ్బతో మిగితా చానెల్స్ వారికి పోటీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. సినిమా హీరోలను మించి అభిమానం ఈ సీరియల్ కేరక్టర్లకు ఉంది. 

 

ముఖ్యంగా ఈ సీరియ‌ల్‌లో దీప పాత్ర చాలా ప్ర‌త్యేకం అని చెప్పాలి. వంటలక్క అంటే ఇష్టపడని మహిళా ప్రేక్షకులు దాదాపు ఉండరు. సీరియల్ లో తన నటనతో కన్నీళ్లు పెట్టించే దీపకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఉన్న దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్. ఇదిలా ఉంటే.. కార్తీక దీపం సీరియల్‌లో కొత్త యాంగిల్ బయటపడింది. ఇప్పటికే వంటలక్క ఫ్యామిలీ అంతా ఒక్కటవుతోందని ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడే ఒక అనుకోని ట్విస్ట్ ఎదురుకానుందని టాక్ వినిపిస్తోంది.


 
వంటలక్క, కార్తీక్ ఒక్కటవుతున్న సమయంలో ఆమెకు యాక్సిడెంట్ అవుతుందని దీంతో ఆమె చనిపోయిందని అంతా అనుకుంటారని, అయితే వంటలక్క మాత్రం గతం మర్చిపోయి, వేరే కుటుంబంలో ఆశ్రయం పొందుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే దీప దూరమైన బాధలో కార్తీక్ అనారోగ్యం పాలవుతాడని, అక్కడి నుంచి చికిత్స కోసం విదేశాలకు వెళ్లతాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మలయాళంలో కార్తీకదీపం మాతృక కారుముత్తు సీరియల్ పూర్తి అయ్యింది. అందులో ఈ తరహా ట్విస్ట్ తోనే న‌డిచింది. ఇప్పుడు తెలుగులో వ‌చ్చే కార్తీక‌దీపం సీరియ‌ల్ కూడా ఇదే ట్విస్ట్ ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: