సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అజ్ఞాతవాస్తి ఫ్లాప్ తర్వాత ఎన్.టి.ఆర్ తో చేసిన అరవింద సమేత పర్వాలేదు అనిపించగా బన్నితో చేసిన అల వైకుంఠపురములో మాత్రం మరోసారి త్రివిక్రం రేంజ్ ఏంటన్నది తెలియచేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న త్రివిక్రం త్వరలో తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ చేస్తున్నాడు. త్రివిక్రం నెక్స్ట్ మూవీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఉంటుందని వార్తలు రాగా అల వైకుంఠపురములో హిట్ అవడంతో రాం చరణ్ కూడా త్రివిక్రం తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.

 

చరణ్, తారక్ ఇద్దరు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యేంతవరకు వేరే సినిమా చేసే ఛాన్స్ లేదు. ఇక లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం త్రివిక్రం తన తర్వాత సినిమా మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రివిక్రం ఈసారి తన సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ చేశారట. సినిమా కథకు తగినట్టుగా ఈ టైటిల్ అయితే బాగుంటుందని ఇది ఫైనల్ చేశారట.

 

ఈ సినిమాలో రాం చరణ్ హీరోగా నటిస్తాడని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత చరణ్, త్రివిక్రం కలిసి ఈ సినిమా చేస్తారని తెలుస్తుంది. అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక అల వైకుంఠపురౌములోనే కాదు నెక్స్ట్ చేసే సినిమాకు కూడా త్రివిక్రం తన అ సెంటిమెంట్ వదిలిపెట్టలేదు. అయినను పోయి రావలె హస్తినకు క్రేజీ టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. చరణ్ తో చేస్తే ఇదే మొదటి సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: