మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్, ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాల సూపర్ సక్సెస్ తరువాత ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, అత్యున్నత సాంకేతిక విలువలతో, అత్యధిక ఖర్చుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ పై టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. 

 

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇకపోతే తొలిసారిగా మెగా, నందమూరి హీరోలిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆయా హీరోల ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కొన్నేళ్ల నుండి, నేను ఎన్టీఆర్ మంచి స్నేహితులం, అలానే తన ఫ్యామిలీతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. 

 

తను సెట్స్ లో ఉన్నపుడు సెట్ అంతా ఎంతో సరదాగా ఉంటుంది, అలాంటిది ప్రస్తుతం తాను లేకుండా సాగుతున్న ఈ షూటింగ్ లో ఏదో కొంత వెలితి కనపడుతోందని అన్నారు. తామిద్దరి మధ్య మంచి ర్యాపొ ఉండడం వల్లనే సినిమాలోని కొన్ని కీలక సీన్స్ లో ఇద్దరం కలిసి ఎంతో జాగ్రత్తగా నటించాం అని, తప్పకుండా మా ఇద్దరికీ కూడా ఈ సినిమా మంచి ల్యాండ్ మార్క్ ఫిలిం అవుతుందని రామ్ చరణ్ చెప్పారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తుండగా రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: