మాస్ మహారాజా రవితేజ మరోసారి సింగర్ అవతారం ఎత్తాడు. 80..90.. దశకంలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి రమ్ పమ్ బమ్ అంటూ హుషారైన గీతానికి స్వరం కలిపాడు రవితేజ. 

 

రవితేజ పాట పాడటం కొత్తేమీ కాదు. బలుపు సినిమాలో కాజల్ కు చెల్లివా సాంగ్ ముందు వచ్చే సాకీని ఆలపించాడు. ఆ తర్వాత పవర్.. రాజాది గ్రేట్ లో వాయిస్ మాత్రమే ఇచ్చిన రవితేజ డిస్కో రాజాలో బప్పీలహరితో కలిసి ఫుల్ సాంగ్ నే పాడాడు. 

 

బలుపు.. పవర్ సినిమాలతో రవితేజలోని గాయకుడిని తమన్ బైటకు తీసుకొచ్చాడు. ఈ సారి మాటలతో సరిపెట్టుకోకుండా  పాటనే ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ అంటూ సాగే పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. 

 

ఒక్క క్షణం దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కో రాజా ఈనెల 24న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ అనే చెప్పేశాడు దర్శకుడు. నభా నటేశ్.. పాయల్ హీరోయిన్స్ గా నటించగా.. బాబీ సింహా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. మాస్ రాజా డిఫరెంట్ గెటప్స్.. షేడ్స్ లో కనిపిస్తూ కొత్తగా ట్రై చేశాడు. 

 

రవితేజ పేరు చెప్పగానే ప్రజలు ఉర్రూతలూగిపోతారు. ఎందుకంటే మాస్ రాజా చలాకీ యాక్టింగ్.. నవ్వించే టాలెంట్.. పౌరుషం పెంచే డైలాగ్స్ తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాడు. ఎవరైనా సరే థియేటర్ లో అడుగు పెడితే చాలు శాటిస్ ఫై చేసి పంపించేస్తాడు. అలాంటి దిల్ ఉన్నోడు రవితేజ. ఇపుడు మాస్ రాజా మరో అడుగు ముందుకేశాడు. డిస్కో రాజాలో పాటతో అందర్నీ మెస్మరైజ్ చేయబోతున్నాడు. మొత్తానికి రవితేజ తన ఎంత టాలెంట్ ఉందో అంతా బయటపెట్టేసి అభిమానులకు ఫుల్ మజా పంచబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: