స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం `అల వైకుంఠపురములో`. భారీ అంచ‌నాల న‌డుమ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. వాస్త‌వానికి అల వైకుంఠపురములో చిత్రం విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ హిట్ అన్న నమ్మకాన్నికలిగించింది చిత్ర‌యూనిట్‌. తమన్ అందించిన పాటలతో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేయగా.. త్రివిక్రమ్ తన మాటలతో, టేకింగ్ బాక్సాఫీస్‌ను వణికించింది.

 

దీనికి త‌గ్గ‌ట్టుగానే ఈ చిత్రం విడుద‌లైన తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. మహేష్ నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘అల’ ప్రభంజనానికి తిరుగులేనంతగా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తోంది.అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ రోజు లానే ప్రతి రోజూ బాక్స్ ఆఫీస్ షేక్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి.

 

 లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ తెర మీద కనిపిస్తుండటం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాకు భారీగా ప్ల‌స్ అయింది. ఇక మొదటి ఐదు రోజుల్లో 69.63 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసి పలు ఏరియాల్లో బాబుబలి 2 రికార్డ్ ని నెలకొల్పిన ఈ చిత్రం 6వ రోజు కూడా హౌస్ ఫుల్స్ తో 8 కోట్ల షేర్ సాధించింది. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో ఈ ‘అల’ ప్రభంజనం తగ్గేలా అయితే కనిపించడం లేదు. 

 

‘అల వైకుంఠపురములో’ ఆంధ్ర – తెలంగాణ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

 

నైజాం – 24.55 కోట్లు

 

సీడెడ్ – 12.1 కోట్లు

 

గుంటూరు – 7.61 కోట్లు

 

ఉత్తరాంధ్ర – 11.12 కోట్లు

 

తూర్పు గోదావరి – 6.92 కోట్లు

 

పశ్చిమ గోదావరి – 5.37 కోట్లు

 

కృష్ణా – 7.04 కోట్లు

 

నెల్లూరు – 3 కోట్లు
------------------------------------------------------
ఆరు రోజుల మొత్తం షేర్ – 77.71 కోట్లు
------------------------------------------------------
 

మరింత సమాచారం తెలుసుకోండి: