ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి హీరో కార్తికేయ కంటే ఎక్కువ క్రేజ్ పాయల్ కే వచ్చింది. ఆమే అందం పర్ఫార్మెన్స్ తో పాటు డీప్ లిప్ లాక్స్ కి యూత్ పిచ్చివాళ్ళైపోయారు. ఆ దెబ్బతో టాలీవుడ్ ఈ గ్లామర్ బ్యూటికి తిరుగు లేదనుకున్నారు అందరు. అయితే ఆర్ఎక్స్ 100 తో వచ్చిన క్రేజ్ మొత్తాన్ని ఆర్డీఎక్స్ లవ్ తో పోగొట్టుకుంది పాయల్. ఆ సినిమాలో పచ్చి డైలాగులు, బూతు సన్నివేశాలలో నటించినందుకు పాయల్ మీద విపరీతంగా విమర్శలు వచ్చాయి. ఒకరకంగా పాయల్ ఫ్యాన్స్ తిట్టినంత పని చేశారు కూడా. దానికి కారణం, అదే టైమ్ లో ఆమె వెంకటేష్ సరసన వెంకీమామ సినిమా చేస్తోంది. ఓవైపు వెంకటేష్ తో సినిమా చేస్తూ, మరోవైపు ఈ బూతు సినిమా ఏంటంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పాయల్ ని తెగ ఆడేసుకున్నారు. అయితే ఇవన్నీ పట్టని పాయల్ మరోసారి అలాంటి బూతు సినిమాకు ఓకే చెప్పి అందరకీ షాక్ ఇచ్చింది.

 

ప్రస్తుతం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కోరాజా సినిమా చేస్తోంది. అయినప్పటికీ మరో సి-గ్రేడ్ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని తాజా సమాచారం. ఆర్డీఎక్స్ లవ్ తరహాలోనే పైకి సందేశాత్మకంగా చూపిస్తూనే, లోపల బాగా మసాలా ఉన్న సినిమా అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోందట. ఇలాంటి టైమ్ లో పాయల్ ఎందుకిలాంటి సినిమాలు అంగీకరిస్తుందనేది ఆశ్చర్యకరంగా మారింది. వెంకీ సినిమా కూడా పాయల్ కి పెద్దగా ఉపయోగపడింది లేదని అంటున్నారు. చాలా ఆశలే పెట్టుకున్నప్పటికి వచ్చిన క్రేజ్ లో వెంకీ చైతూ కి పోగా మిగిలిన క్రేజ్ రాశీఖన్నా ఎత్తుకుపోయింది. దాంతో పాయల్ కి వెంకీ మామ వల్ల ఒరిగిందేమీ లేదన్న టాక్ వినిపించింది. 

 

ఇక డిస్కోరాజా మినహాయిస్తే ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే డిస్కోరాజా తర్వాత పాయల్ చేతిలో మరో తెలుగు సినిమా లేదు. అందుకే పాయల్ ఇలా మసాలా సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ తరహా సినిమాలతో పాయల్ బాగానే రెమ్యూనరేషన్ తీసుకుంటోందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇలా రెమ్యూనరేషన్ కోసం ఇలా సి గ్రేడ్ సినిమాలు ఒప్పుకోకుండా వేయిట్ చేస్తే వెంకటేష్, రవితేజ లాంటి వాళ్ళ సినిమలలో ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు. మరి అప్పటి వరకు ఆగితే పాయల్ కి డబ్బు ఎలా వస్తుంది ఎవరిస్తారు ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: