తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని వారి కోడలు సమంతా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత సమంత క్రేజ్  అక్కినేని కోడలిగా అమాంతం పెరిగిపోయింది. అమాంతం ఒక్కసారిగా పెరిగి పోయిన సమంత సమంత  క్రేజ్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ సరైన సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా  సినిమాలు చేయొచ్చు అని నిరూపించింది సమంత. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ అద్భుత విజయాలను సొంతం చేసుకుంటుంది ఈ అమ్మడు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతుంది అక్కినేని వారి కోడలు సమంత. 

 

 

 ప్రస్తుతం సమంతకి ఓ చిన్న కోరిక మదిలో మెదిలింది. సొంత ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి... తమ ఇష్టానికి అనుగుణంగా ఒక ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు ఉంటుంది. ప్రస్తుతం అక్కినేని వారి కోడలు సమంతాకి కూడా అలాంటి ఆలోచన వచ్చిందట. ఏంటి  సమంతకు సొంత ఇల్లు లేదా అని అనుకుంటున్నారా... సొంత ఇల్లు ఉన్న ఇష్టమైన ప్లేస్ లో ఉంటే మాత్రం ఆ కిక్కే వేరు కదా. అయితే సమంతా కి గోవా అంటే చాలా ఇష్టమట. గోవాలో తన ఇష్టాలకు అనుగుణంగా ఒక ఇల్లు కట్టుకోవాలని  ప్లాన్ చేస్తోందట సమంత. మామూలుగానే సమంత పుట్టినరోజు అయిన పెళ్లి అయినా నాగచైతన్య తో గోవాకి  వెళ్తు ఉంటుంది.సముద్ర  తీరంలో నాగచైతన్యతో సరదాగా గడుపుతూ ఉంటుంది అక్కినేని సమంత..

 

 

 అయితే ప్రస్తుతం అక్కడ ఒక ఇళ్ళు  కట్టుకోవాలి అనే ఆలోచన చేస్తుందట అక్కినేని వారి కోడలు సమంత. ఇప్పటికే  గోవాలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఐశ్వర్య లకు విల్లాలు ఉన్నాయట . వారిలాగే తాను కూడా సకల సౌకర్యాలతో తన ఇష్టాలకు అనుగుణంగా ఓ ఇల్లు కట్టుకోవాలని అక్కినేని వారి కోడలు నాగచైతన్య సతీమణి  సమంత భావిస్తోందట. ఇక వివిధ సందర్భాల్లో గోవా కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనే ఉండాలని భావిస్తున్నదట  సమంత. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఇకపోతే ప్రస్తుతం సమంత శర్వానంద్ కు జోడిగా 96 రీమేక్ జానూ  సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నది  సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: