ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ రేపు సినిమా షూటింగ్ కు హాజరు కాబోతున్నాడు. రేపు ఉదయం ‘పింక్’ రీమేక్ షూటింగ్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పటికే ‘పింక్’ రీమేక్ కోసం రెడీ పెట్టిన సెటింగ్ లో ఈపూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.

మూవీ లాంచ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి నాగబాబులు కూడ వస్తారని సమాచారం. ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మేకప్ వేసుకుని ఈ మూవీ సెట్స్ పైకి వచ్చే పవన్ కేవలం 40 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు అని తెలుస్తోంది.

ఇంత తక్కువ డేట్స్ పవన్ ఇచ్చినప్పటికీ పవన్ కు ఈ సినిమాకు సంబంధించి 50 కోట్ల పారితోషికం పాటు లాభాలలో వాటా కూడ ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సమ్మర్ లో విడుదల కాబోతున్న ఈ మూవీకి పోటీ ఇవ్వగల ఒక టాప్ హీరో సినిమా కూడ లేదు. 

టాప్ హీరోలుగా పరిగణింప బడుతున్న ప్రభాస్ మహేష్ చరణ్ అల్లు అర్జున్ చిరంజీవిల సినిమాలు ఏవీ ఈ సమ్మర్ రేస్ లో ఉండకపోవడంతో ఇక ఈ సమ్మర్ రేస్ కలక్షన్స్ హడావిడి అంతా పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ కు సోలోగా దక్కబోతోంది. దీనితో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వేణు శ్రీరామ్ జాగ్రత్తగా ఈ మూవీని తీసి మెప్పిస్తాడని టాప్ హీరోల పోటీలేని పరిస్థితులలో ఈసినిమాకు రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అన్న ఆశలు దిల్ రాజ్ చాల తెలివిగా నమ్మకంతో పవన్ కళ్యాణ్ కు చెప్పి ఒప్పించి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకు వస్తున్నాడని సమాచారం. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చాల వేగంగా చేయాలని భావిస్తున్నా పవన్ ఆలోచనలలో ఎటువంటి మార్పులు లేకుండా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయగలిగితే ఈ ఏడాది సమ్మర్ రేస్ లో పవన్ మ్యానియా ఖాయం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: