మనం మన డైలీ లైఫ్ లో ఎంతో మంది బిచ్చగాళ్ళను రోడ్డుమీద చూస్తూ ఉంటాం. యాచకులు అంతా జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో భిక్షాటన చేస్తూ వారి కాలం గడుపుతూ ఉంటారు. అయితే బిచ్చగాడు గురించి చూస్తే మాత్రం మీరు అవాక్కు అవ్వక తప్పదు. సరిగ్గా విజయ్ ఆంటోనీ సినిమా అయిన 'బిచ్చగాడు' లాగానే ఉంటుంది కథ.

 

ఒక యాచకుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఒక రిక్షా కార్మికుడు తో తనకు గొడవ అయిందని అతని పై కంప్లైంట్ ఇచ్చిన యాచకుడు ఇంగ్లీష్ లో తన కంప్లైంట్ రాశాడు. బిచ్చగాడు ఏంటి ఇంగ్లీష్ లో రాయడం ఏంటి అని కంప్లైంట్ ను పరిశీలించిన పోలీసులు ఒక్కసారి గా షాక్ కు గురి అయ్యారు. ఒక్క తప్పు లేకుండా కంప్లైంట్ నీట్ గా రాసిన అతని చూసి అసలు వచ్చింది బిచ్చగాడా కాదా అని చూశారు.

 

కట్ చేస్తే ఆయన ఒక ఇంజనీర్, వయసు 51 ఏళ్ళు. పేరు గిరిజా శంకర్ మిశ్రా. తండ్రి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. బీఎస్సీ పూర్తయ్యాక.. ప్లాస్టిక్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ నుంచి సర్టిఫికేట్ పొందారు. తర్వాత ముంబైలో.. కొన్నిరోజులు హైదరాబాద్‌‌లో పని చేశారు. సీనియర్లతో ఉన్న గొడవల కారణంగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశారు.

 

రిక్షా కార్మికుడు తో గొడవ కొట్టుకునే వరకూ వెళ్లడంతో అతని గాయాలకి ప్రధమ చికిత్స అందించిన పోలీసులు చివరికి అతని వద్ద కంప్లైంట్ తీసుకోవడం జరిగింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: