సంక్రాంతి పండగ టాలీవుడ్ హీరోలకు మంచి గుర్తింపు వచ్చింది.  ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా అందులో 3 సినిమాలు మంచి విజయం సాధించాయి.  జనవరి 9 వ తేదీన రజినీకాంత్ దర్బార్ సినిమా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.  తమిళంతో పాటుగా తెలుగులో కూడా దర్బార్ కు మంచి వసూళ్లు వచ్చాయి.  పెట్టిన డబ్బులు ఇప్పటికే వెనక్కి తెచ్చుకుంది దర్బార్.  తమిళనాడులో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్నది.  


ఇకపోతే, జనవరి 11 వ తేదీన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అయ్యింది.  మొదటి షో నుంచి సినిమాకు మంచి టాక్ వచ్చింది.  అయితే, సెకండ్ హాఫ్ పై పెద్దగా ఆసక్తి చూపకపోయినా, మాస్ సినిమా కావడంతో మంచి విజయం సొంతం చేసుకుంది.  ఇకపోతే, సినిమా ఇప్పటికే రూ.  100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి కనీసం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.  మొత్తానికైతే సినిమా వసూళ్ల విషయం సంక్రాంతి విజేతగా నిలిచింది.  


ఇక ఈ సినిమా తరువాత జనవరి 12 వ తేదీన అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలో రిలీజ్ అయ్యింది.  త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సైతం భారీ విజయం సొంతం చేసుకోవడంతో సంక్రాంతికి రిలీజైన మూడు సినిమాలు వరసగా విజయం సాధించాయి.  త్రివిక్రమ్ పై నమ్మకం ఉంచిన అల్లు నమ్మకం వమ్ము కాలేదు.  వసూళ్ల పరంగా కూడా మంచి విజయం దక్కించుకుంది.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం మరో ప్లస్ అయ్యింది.  మ్యూజికల్ గా సినిమా మొదట హిట్ అయ్యింది.  ఆ తరువాత పనిని త్రివిక్రమ్ చూసుకున్నాడు.  


ఇకపోతే ఈ సంక్రాంతికి నిరాశ పరిచిన సినిమా ఏదైనా ఉంటె అది ఎంత మంచి వాడవురా సినిమా అని చెప్పాలి.  ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చినా స్క్రీన్ ప్లే నిదాన్మగా ఉండటంతో ప్రేక్షకులకు ఎక్కలేదు .  అదే సినిమాకు మైనస్ అయ్యింది. అయితే, మొదటి మూడు సినిమాలు హిట్ కావడంతో సంక్రాంతి హీరోలు పండగ చేసుకుంటున్నారు.  తమిళనాడులో రజినీకాంత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ టాలీవుడ్ లో పండగ చేసుకుంటున్నారు.  మొత్తానికి ఈ సంక్రాంతి పాజిటివ్ గా స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: