బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఇంట విషాదం చోటు చేసుకుంది.  షాహిద్ కపూర్, ఈషాన్ ఖట్టర్‌ల నాన్నమ్మ ఖాదిజా అజీమ్ కన్నుమూశారు. హిందీ టీవీ, సినీ నటి నీలిమ అజీమ్ తల్లి ఖదిజా అజీమ్ గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న నాటి నుంచి షాహిద్, ఈషాన్ వారి నాయనమ్మతో ఎంతో అనుబంధం ఉండేదట. ఆమె ఇచ్చే ధైర్యం.. సంతోషం ఇక తమకు దూరమైనాయని వారు ఎంతో బాధపడ్డారు.  తమ నాయినమ్మ ఇక లేరని..తిరిగిరాని లోకానికి వెళ్లారని.. ఈ విషయాన్ని దఢక్ ఫేమ్ ఇషాన్ కట్టర్ సోషల్ మీడియాలో తెలిపారు.   ఖాదిజా యంగ్‌ హీరో దడక్‌ ఫేం ఇషాన్ కట్టర్‌కు కూడా అమ్మమ్మ.  

 

అమ్మమ్మ లేని లోటుపై ఇషాన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది. ‘అమ్మీ.. మీరు మా అందరికీ తెలివి, పట్టుదల, బుద్ధిని ఇచ్చారు. ఫ్రీడమ్ ఫైటర్, అనువాదకురాలు, ఎడిటర్, సోదరి, భార్య, అత్త, అమ్మమ్మ, స్నేహితురాలు ఇలా ఎన్నో రకాలుగా మాకు ఎంతో చేశావు. ఇతరులెవ్వరు నీ స్థానాన్ని భర్తీ చేయలేరు. నీవు నా జీవితంలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నాను. ఎవరి జీవితాలపై నీ ప్రభావం ఉందో వారు ఎన్నటికీ నిన్ను మరిచిపోలేరంటూ’ యంగ్ హీరో ఇషాన్ కట్టర్ భావోద్వేగంతో చేసిన పోస్ట్ నెటిజన్లను మనసు దోచుకుంది.

 

ప్రస్తుతం తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్‌ రీమేక్ కబీర్ సింగ్‌తో షాహిద్ కపూర్ విజయాన్ని అందుకున్నాడు. నాని నటించిన జెర్సీ రీమేక్ పనులతో బిజీగా ఉన్నాడు షాహిద్. అతడి సోదరుడు ఇషాన్ కట్టర్ సైతం తెలుగు సినిమా బాలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మూవీ టాక్సీవాల బాలీవుడ్ రీమేక్ ‘ఖాలీ పీలీ’తో ఇషాన్ నటిస్తున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Ammi.. you instilled wit, fire, knowledge, perseverance, purpose and meaning in all of us. Freedom fighter, writer, translator, editor.. sister, wife, mother, aunt, grandmother, friend, confidant - you were so many things and more. They don’t make them like you anymore. Blessed to have had you in my life. I’ll carry a small piece of your vast presence with me always. You’ll never be forgotten by anybody whose life you deeply impacted. In the first picture on the left, my nani - Khadija Azeem - with her sister and my grand aunt, Shahida ammi. Here she is beaming proudly at her elder grandson’s wedding reception. The second picture is her with her two children, my Mamoo and my mother. And the third is her with her favourite aunt and mom.

A post shared by Ishaan (@ishaankhatter) on

మరింత సమాచారం తెలుసుకోండి: