జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ జడ్జి  గా కొనసాగుతున్న నాగబాబు  తాజాగా జబర్దస్త్ షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ లో నుంచి నాగబాబు తప్పుకోవడం తో పాటు ఎంతోమంది క్రియేటివ్ టీమ్  పట్టుకెళ్ళారు అని సమాచారం. వీరందరితో జీ తెలుగులో అదిరింది లోకల్ గ్యాంగ్ పేరుతో ఫోన్ చేస్తూ కుమ్మేస్తున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపోతే ఈ రోజు జబర్దస్త్ లో కూడా నాగబాబు వెళ్లిపోయాక రోజా ఫ్రీ  అయిపోయింది . ఎంతో హుషారుగా పంచులు వేస్తుంది.  నాగబాబుతో సహా నవదీప్ అదిరింది లో జడ్జి గా  చేస్తుంటే అటు రోజా పక్కన మాత్రం ప్రతి ఎపిసోడ్ కు ఒకరు జడ్జి గా  వస్తూ పోతూ ఉన్నారు. అయితే ఈ రెండు షోలు టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయని  తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్న మాట. 

 

 

అయితే టీవీ ఛానల్ కు సంబంధించి విడుదలైన రేటింగ్స్ ఏ  ఛానల్ లో  ఏ ప్రోగ్రాం సత్తా ఎంత ఉందో తేలిపోయింది. జీ తెలుగు రేటింగ్ చూసుకుంటే టాప్ 30 ప్రోగ్రామ్స్ లో ... నాగబాబు అదృష్టం  ఎంత ఉందో తేలిపోయింది. జీ తెలుగులో  ప్రసారమయ్యే  ప్రేక్షకుల ఆదరణ పొందిన వాటిలో టాప్  30 లో కూడా నాగబాబు జడ్జి గా  వ్యవహరిస్తున్న అదిరింది కానీ లోకల్ గ్యాంగ్  కానీ లేకపోవడం గమనార్హం. దిగువన ఉన్న రామ సక్కని సీత అనే సీరియల్ 3.34 రేటింగ్ ను  సొంతం చేసుకుంది. అయితే ఈ సీరియల్ కింద కూడా నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న అదిరింది షో  లేకపోవడం గమనార్హం. ఇక సినిమా భాషలో చెప్పాలంటే అదిరింది అట్టర్ ఫ్లాప్ అన్నమాట. మా టీవీలో ప్రసారమయ్యే సిక్స్త్ సెన్స్ 5.38 రేటింగ్ సొంతం చేసుకుంది. సిక్స్త్ సెన్స్ అంతగా ఇంట్రెస్ట్ గా ఉండక పోయినప్పటికీ... ఓంకార్  తీసుకొస్తున్న సెలబ్రిటీల కారణంగా కాస్తోకూస్తో మంచి రేటింగ్ తో  నడుస్తుంది సిక్త్ సెన్స్ . కానీ జీ తెలుగులో మాత్రం టాప్ వన్ రేట్ కోడలు సీరియల్ 5.11 రేటింగ్ దగ్గరే కొట్టుకుంటుంది. దీంతో రియాల్టీ షోకి సీరియల్ కు పెద్దగా తేడా లేకుండా పోయింది. 

 

 

 

 అయితే అటు జబర్దస్త్ పరిస్థితి ఏమైన బావుందా అంటే అది కూడా లేదు. జీ తెలుగు లో ప్రసారమయ్యే అదిరింది ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ జోకులు ఒకటి కాపీ ఒకటి పేస్ట్  అన్నట్లుగా ఉన్నాయి. అదే  టీం లీడర్లు    అదే కమెడియన్లు... అదే స్కిట్లు చూసి చూసి జనానికి బోర్  వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ రెండు ప్రోగ్రామ్ లలో  చేసే స్కిట్లు కూడా పెద్దగా ప్రేక్షకులను నవ్వించలేకపోతున్నాయి . చాలామంది ప్రేక్షకులు యూట్యూబ్ లో దొరికే క్రియేటివ్ కామెడీ కి అలవాటు పడిపోతున్నారు. ఇంతకీ జబర్దస్త్ షో రేటింగ్ ఎంత అనుకుంటున్నారు 4.24... అంటే టీవీ భాషలో చెప్పాలంటే బిలో ఆవరేజ్ సీరియల్ కు  వస్తున్నంత రేటింగ్ జబర్దస్త్ షో కి వస్తుంది అన్నమాట. జెమినీ టీవీ మాత్రం ఎలాంటి రియాలిటీ షోల జోలికి  వెళ్ళకుండా సీరియల్స్ తో  నెట్టుకొస్తుంది. ఇకపోతే ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరూ.. రియాలిటీ షోల కంటే.. వంటలక్కలు,  వదినమ్మల  సీరియల్ కి చూడడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు ప్రస్తుతం విడుదలైన రేటింగ్స్ ద్వారా స్పష్టంగా అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: