మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాకి మొట్ట మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో పైగా ‘నా పేరు సూర్య…’ లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ సినిమా చేయడంతో సినిమాకి మ్యూజిక్ పరంగా వచ్చిన రెస్పాన్స్ సినిమా పరంగా కూడా రావడంతో సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదలైన అన్ని సినిమాలలో ‘అల వైకుంఠపురములో’ సినిమా ఏ విజేతగా నిలిచింది. ముఖ్యంగా త్రివిక్రమ్ ఈ సినిమాని దర్శకత్వం వహించడంతో ఓవర్సీస్లో కళ్ళు చెదిరే విధంగా రికార్డు స్థాయిలో అల్లు అర్జున్ కెరీర్లోనే ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా సాధించింది. 

 

దీంతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో ఎక్కువగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తోనే త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా న్యూస్ వినబడుతోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఫుల్ యాక్షన్ ఫ్యాషన్ స్టోరీ అయిన నేపథ్యంలో ఈసారి మాత్రం త్రివిక్రమ్ ఫ్యామిలీ స్టోరీ చేయాలని డిసైడ్ అయినట్లు దీంతో ఈ వార్తలు వస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ అభిమానులు స్టోరీ ఇస్తున్నట్లు యాక్షన్ కాకుండా ఫ్యామిలీ స్టోరీ కథలు త్రివిక్రమ్ కి పోస్ట్ చేస్తున్నట్లు ఇదే తరుణంలో కొంతమంది పంచు తరహాలో అదిరిపోయే కామెడీ ఎన్టీఆర్ తో చేయించాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నట్లు ఫిలింనగర్ లో మరియు సోషల్ మీడియాలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.

 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ అయిన వెంటనే ఎన్టీఆర్ ...త్రివిక్రమ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: