సూపర్ హిట్ తో బోల్డంత ఎనర్జీ వస్తుంది. హీరోల మార్కెట్ రేంజ్ పెరిగిపోతుంది. అలాగే దర్శకులపై హీరోల నమ్మకం కూడా ఎక్కువవుతుంది. ఈ నమ్మకంతోనే హిట్స్ ఇచ్చిన దర్శకులతో వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు మహేశ్ బాబు. 


మహేశ్ బాబు ఇపుడు సరిలేరు నీకెవ్వరు.. హ్యాంగోవర్ లో ఉన్నాడు. ఈ సినిమా మూడు రోజుల్లోనే వందకోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని సంబరాలు చేసుకుంటున్నాడు. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందనే ట్రేడ్ రిపోర్ట్ లతో, ఫ్యూచర్ ప్రాజెక్టులపై మరింత ఫోకస్ పెడుతున్నాడు. ఈ ఇదిలోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఇద్దరు దర్శకులను రిపీట్ చేస్తున్నాడు మహేశ్. 

 

మహేశ్ బాబు తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడు. మహర్షితో సూపర్ హిట్ ఇచ్చిన వంశీ దర్శకత్వంలో మరో మూవీకి కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్లబోతోంది. వంశీపైడిపల్లితో తర్వాత మళ్లీ అనిల్ రావిపూడితోనే సినిమా చేస్తాడట మహేశ్ బాబు. అయితే వంశీ పైడిపల్లి మూవీ కంప్లీట్ అవ్వడానికి కనీసం ఆరు నెలలు సమయం పడుతుంది. ఈ లోపు అనిల్ రావిపూడి ఎఫ్ 2, ఎఫ్ 3 కంప్లీట్ చేస్తాడట. ఆ వెంటనే మహేశ్, అనిల్ రావిపూడి మూవీ మొదలవుతుందని సమాచారం. 

 

మహేశ్ బాబుకి హిట్ ఇచ్చిన దర్శకులపై నమ్మకం చాలా ఎక్కువ. వాళ్లతో వెంటనే సినిమాలు చేస్తుంటాడు. అయితే అన్ని సార్లు మహేశ్ నమ్మకాలు ఫలించలేదు. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేసిన చాలాసార్లు బోల్తాపడ్డాడు. 

 

మహేశ్ బాబు హిట్ దర్శకులందరినీ రిపీట్ చేశాడు. గుణశేఖర్ నుంచి మొదలుపెడితే.. కొరటాల శివ వరకు చాలామంది దర్శకులతో రిపీటెడ్ సినిమాలు చేశాడు. ఒక్కడుతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన గుణశేఖర్ దర్శకత్వంలో అర్జున్, సైనికుడు చేశాడు. అయితే అర్జున్, సైనికుడు సినిమాలు ఆశించినంతగా ఆకట్టుకోలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: